ప్రపంచమంతటా భిన్న సంస్కృతి.. విభిన్న ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఏ ఒక్క చోట ఒకే తీరున భోజనం చేయరు. ఆ విధంగా భూగోళంపై మానవ జీవులు నాలుక ఒకటైనా రుచులు వేరుగా ఉంటాయి. వారిలో చైనా వారిది ప్రత్యేకమైనది. వారు తినని జంతువు అనేది ఉండదని చెప్పడం కష్టమవుతుంది. ఆ విధంగా చైనా దేశంలో వివిధ ఆహారపు అలవాట్లు ఉంటాయి. అందుకే కొత్తకొత్త వైరస్‌లు రావడానికి ఇది కూడా ఒక కారణమని చెబుతారు. అలాంటి ఆహారపు అలవాట్లు మరో దేశంలో కూడా ఉన్నాయి. ఆ దేశం దక్షిణ కొరియా. ఆ దేశంలో మనం ఎంతో ప్రేమగా పెంచుకునే కుక్కలను చంపేసి తింటుంటారు. సేమ్ మనతీరే మనం కోడిలను కూడా పెంచుకుంటాం.. ఎంచక్కా ఆదివారం బలి ఇస్తాం. ఇలాంటి పద్ధతే దక్షిణ కొరియా వారు పాటిస్తున్నారు.
దక్షిణ కొరియా దేశంలో అనాదిగా ల్యూనార్ క్యాలెండర్ ఆచరిస్తారు. ఆ క్యాలెండర్ ప్రకారం వారు పండుగుల.. ఉత్సవాలు చేసుకుంటారు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు చేసుకునే ప్రత్యేక ఉత్సవాలు బొక్నాల్ లేదా బాక్ నల్. ఈ పేరుతో జూలై 19, 29, ఆగస్టు 8వ తేదీలలో ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో కుక్క మాంసంతో చేసిన వంటకమే ప్రత్యేకం. ఈ వేడుకల్లో డాగ్ సూప్ మహా ఇష్టంగా తాగుతారు. డాగ్ సూప్ తాగడం, కుక్క మాంసం తినడంతో శరీరానికి మంచి శక్తి, చల్లదనం లభిస్తుందని కొరియన్లు భావిస్తారు. అయితే కొరియన్లు కుక్కలను చంపకుండా మరిగే నీటిలో వాటిని వేసి సూప్ తయారు చేసుకోవడం అందరినీ కలచివేసే విషయం. కాకపోతే వారి దేశంలో అదొక సంప్రదాయంగా వస్తోంది.