ఓ మహా ఉద్యమం తర్వాత తనకు తానుగా..ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ. దాదాపు 60 ఏళ్లకు పైనే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తెలుగు ప్రాంతాలు.. రెండు రాష్ట్రాలుగా విడిపోవాలన్న ఉద్దేశ్యంతో మొదలైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.. 2014లో సాకారమైన విషయం తెలిసిందే. పెద్దఎత్తున బలిదానాలతో పాటు.. తెలంగాణ సమాజం మొత్తం ఒకటిగా మారి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాల్సిందేనంటూ పట్టుబట్టటం.. రాజకీయంగా మారిన పరిస్థితులతో అన్నీ పార్టీల అంగీకారంతో తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడటం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పద్నాలుగు నెలలు కూడా కాకముందే.. మరో నినాదం షురూ అయ్యింది. అది కూడా కాంగ్రెస్ నేతల నోటి నుంచి ఈ నినాదం రావటం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ ప్రయోజనాల కోసం రంగారెడ్డి జిల్లా ప్రయోజనాల్ని పణంగా పెడుతున్నారని ఆరోపిస్తూ.. జై దక్షిణ తెలంగాణ నినాదాన్ని కాంగ్రెస్ నేతలు చేయటం గమనార్హం. తెలంగాణలోని దక్షిణ జిల్లాల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని.. వివక్ష పాటిస్తున్నారని ఆరోపిస్తూ దక్షిణ తెలంగాణ నినాదాన్ని చేయటం విశేషం.
తాజా నినాదంతో తెలంగాణలోని పలువురు ఒక్కసారి ఉలిక్కిపడిన పరిస్థితి.తెలంగాణలోని దక్షిణ ప్రాంతాల పట్ల నిర్లక్ష్యం ఇదే రీతిలో కొనసాగితే.. దక్షిణ తెలంగాణ ఉద్యమం మొదలు కావటం ఖాయమని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పద్నాలుగు నెలలు కూడా కాకముందే మరో ప్రత్యేక రాష్ట్ర నినాదం వినిపించటం కాస్తంత ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి నినాదాలు చోటు చేసుకోకుండా తెలంగాణ అధికారపక్షం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.