స్పానిష్ హీరోయిన్ తో రాహుల్ వైర‌ల్ ఫొటో!

Update: 2017-09-21 10:11 GMT
ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ రెండు వారాల ప‌ర్య‌ట‌న నిమిత్తం అమెరికాకు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ రాహుల్ బాబు క్ష‌ణం తీరిక లేకుండా వ‌రుస మీటింగుల‌తో దూసుకుపోతున్నారు. సెంట‌ర్ ఫ‌ర్ అమెరిక‌న్ ప్రోగ్రెస్ ఆధ్వ‌ర్యంలో ఇండియ‌న్‌ - సౌత్ ఏసియ‌న్ ఎక్స్ ప‌ర్ట్స్ తో రౌండ్ టేబుల్ స‌మావేశాల‌తో బిజీబిజీగా గ‌డిపేస్తున్నారు. అంతేకాకుండా, అక్క‌డి యూనివ‌ర్సిటీల్లో విద్యార్థుల‌కు లెక్చ‌ర్ల మీద లెక్చ‌ర్లు దంచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కాలిఫోర్నియా యూనివ‌ర్సిటీ స్టూడెంట్స్ తో రాహుల్ గాంధీ స‌మావేశ‌మ్యారు. వారితో ఇంట‌రాక్ట్ అయిన స‌మ‌యంలో భార‌త్ లో వార‌స‌త్వ రాజ‌కీయాలు కామ‌న్ అంటూ లెక్చ‌ర్ ఇచ్చేశారు. ఇక్క‌డ రాజ‌కీయాల‌తో పాటు సినీ రంగంలో కూడా వార‌సుల‌దే హ‌వా అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆ వ్యాఖ్య‌ల‌కు బాలీవుడ్ సీనియ‌ర్ హీరో రిషీ క‌పూర్ ఘాటుగా స్పందించారు కూడా. అయితే, ఇదంతా నాణేనికి ఒక వైపు. నాణేనికి మ‌రోవైపు రాహుల్ గాంధీ హాలీవుడ్ హీరోయిన్ల‌తో ప‌రిచ‌యం పెంచుకునే కార్య‌క్ర‌మంలో కూడా బిజీబిజీగా ఉన్నారు.

అమెరికాలో నథాలియా రమోస్ అనే ఓ స్పానిష్ ఆస్ట్రేలియన్‌ హీరోయిన్ కు రాహుల్ 'బాబు' త‌న అమూల్య‌మైన స‌మ‌యాన్ని కేటాయించార‌ట‌. అంతేకాదు, ఆ హీరోయిన్ కు జ్ఞాన‌బోధ చేశార‌ట‌. ఈ విష‌యాన్ని స‌ద‌రు హీరోయిన్ సోష‌ల్ మీడియాలో స్వ‌యంగా  పోస్ట్ చేసి రాహుల్ 'బాబు' ను ఆకాశానికెత్తేసింది. రాహుల్ తో పాటు ఆమె సన్నిహితంగా ఉన్న ఫొటోను కూడా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇపుడు ఆ పోస్ట్ వైర‌ల్ అయింది. రాహుల్ ను కలిసే అవకాశం రావడం త‌న అదృష్టమ‌ని న‌థాలియా తెగ సంబ‌ర‌ప‌డిపోయింది. ''గత రాత్రి రాహుల్ గాంధీ అనే ఒక లోతైన అవగాహన కలిగిన మంచి వక్తను కలిసినందుకు చాలా ఆనందంగా వుంది. ఇటువంటి గొప్ప ఆలోచ‌న‌లు క‌లిగిన వ్య‌క్తిని క‌లుసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. '' అంటూ నథాలియా పోస్ట్ చేసింది. రాహుల్ తో ఆమె స‌న్నిహితంగా దిగిన ఫొటోతో పాటు ఈ ఫొటో పెట్ట‌డంతో ఆ పోస్ట్ వైర‌ల్ అయింది. 2007లో వ‌చ్చిన బ్రాట్జ్ అనే సినిమాలో యాస్మిన్ పాత్ర‌తో నథాలియా అమెరికన్ల‌కు సుప‌రిచితురాలు. 'హౌస్ ఆఫ్ అనుబిస్' అనే టీవీ సిరీస్ తో న‌థాలియాకు అమెరికాలో మంచి గుర్తింపు ల‌భించింది. రాక్ స్టార్ అనే మ్యూజిక్ ఆల్బమ్ ద్వారా కూడా అమెరికన్లకు సుపరిచిత‌మే. ఆమె తండ్రి స్పానిష్‌ - త‌ల్లి ఆస్ట్రేలియ‌న్. న‌థాలియా హీరోయిన్ గా హాలీవుడ్ లో స్థిర‌ప‌డింది.
Tags:    

Similar News