ఏపీకి ఆయుధాన్నిచ్చిన బీజేపీ

Update: 2019-02-23 06:48 GMT
కేంద్ర, రాష్ట్రాల మధ్య ఇప్పుడు  పరిస్థితి ఉప్పునిప్పులా ఉంది. బీజేపీ ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చలేదని ఇప్పటికే దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు టీడీపీ రెడీ అయ్యింది. ఇప్పుడు టీడీపీకి ఓ బ్రహ్మాస్త్రం లాంటి ఆయుధం దొరికింది. తాజాగా బీజేపీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన మేనిఫెస్టోలో గోవా రాష్ట్రానికి ప్రత్యేక కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు బీజేపీ ఇచ్చిన హామీని బేస్ చేసుకొని కమళం పార్టీని ఎండగట్టేందుకు టీడీపీ రెడీ అయ్యింది.  

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో గోవాలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ఇస్తామని పేర్కొనడం వివాదాస్పదమైంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తానని గత ఎన్నికల సమయంలో బీజేపీ హామీనిచ్చింది. కానీ ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా బీజేపీ నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోడీ ప్రకటించినా.. మాజీ ప్రధాని మన్మోమన్ పార్లమెంటులో చెప్పినా బీజేపీ సర్కారు పెడచెవిన పెట్టడం దుమారం రేపింది.

టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా తన పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ నేతల ద్వంద్వ నీతిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఓట్లు, సీట్లు, అధికారం కోసం ఏపీకి హోదా ఇస్తానని మాట తప్పిందని.. ఇప్పుడు గోవాలోనూ అదే హామీనిచ్చి ప్రజలను మోసం చేస్తోందని బీజేపీని ఎండగట్టాలని బాబు కోరారట.. నీతి అయోగ్ దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిందని.. కానీ బీజేపీ ఇప్పుడు ఓట్లకోసం మళ్లీ హోదార రాజకీయం మొదలు పెట్టిందని దీనిపై నిలదీయాలని బాబు ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం.

బీజేపీ పాలించని రాష్ట్రాల్లో టీడీపీ నేతలు పర్యటించి బీజేపీ చేసిన మోసాన్ని వివరించాలని బాబు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఏపీకి హోదా ఇస్తానని మోసం చేసిన తీరును గోవాకు బీజేపీ మేనిఫెస్టోలో హోదా ఇస్తామన్నారని.. ఏపీకి ఎందుకు ఇవ్వరని ఆయా రాష్ట్రాల్లో నిలదీయాలని బాబు ప్లాన్ రెడీ చేసినట్లు సమాచారం. ఇలా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీని టార్గెట్ చేసి బాబు గోవా హోదా హామీతో ఎండగట్టాలని చూస్తున్నట్టు తెలిసింది.
Tags:    

Similar News