దేశంలోని అన్ని కార్లలో అంబానీ పిల్లల కార్లు వేరయా..!

Update: 2021-03-30 06:30 GMT
అంబానీ అది పేరు కాదు ఓ బ్రాండ్... అంతకుమించి. ఇక వీరి విలాసవంతమైన జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏటేటా వారి ఆస్తులు అంతకంతకూ పోగవుతున్నయని అందరికీ తెలుసు. ప్రపంచంలోని మొదటి పదిమంది ధనవంతుల్లో వీరు ఉంటారు. కాగా అంబానీ కుటుంబం నివాముండే భవంతులు, ఆ ఇంట్లో ఉండే వస్తువులు అన్నీ ప్రత్యేకతను సంతరించుకునే ఉంటాయి. ఇక అంబానీ గ్యారేజీలో ఉండే కార్లు చాలా ప్రత్యేకమైనవే. ఆయన కుటుంబంలో ఉండే కార్ల గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి కనబర్చుతారు. ఎందుకంటే ఆ ఇంట్లో ప్రపంచంలో వాడే టాప్ కార్లు ఉంటాయి మరి.

అంబానీల్లో ముఖేష్ అంబానీ ఆస్తులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఆయన ముగ్గురు పిల్లల జీవితాలు అంతకుమించి విలాసవంతంగా మారుతున్నాయి. ముఖేష్ అంబానీ పిల్లలు ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ, ఇషా అంబానీలకు సైతం కార్లు అంటే విపరీతమైన మోజు. అందుకే ప్రపంచంలోకెల్లా టాప్ కార్లలో వీరు తిరుగుతారు. ప్రపంచ దిగ్గజ కార్లు అయిన రోల్స్ రాయిస్, బెంట్లీ, టెస్లా, మసెరటీ లెవాంటే వంటి అత్యధిక ఖరీదైన కార్లు వాళ్ల గ్యారేజీల్లో ఉంటాయి.  

ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లల్లో ఎవరికి ఏ కారు ఇష్టం, ఏ కారును ఏ సందర్భంలో వాడుతారు? వాటి ధరలు ఎంత? ప్రపంచంలో వాటి స్థానం అనే ఆసక్తికర అంశాలను గురించి తెలుసుకుందాం. వారు ఉపయోగించే మొదటి 7 కార్లు ఇవే...

* బెంట్లీ బెంటాయిగా
విలాసవంతమైన కార్లకు పెట్టింది పేరు బెంట్లీ బెంటాయిగా. ఈ కంపెనీ అత్యంత ఖరీదైన కార్లను తయారు చేస్తుంది. ఈ కార్లు బ్రిటన్ లో రూపొందిస్తారు. ఈ కంపెనీకి చెందిన మూడు కార్లు అంబానీ గ్యారేజీలో ఉన్నాయి. వాటిలో ఒకటి డబ్లూ 12 ఇంజిన్ సామర్థ్యం కలది. రెండోది డబ్యూ 8 ఇంజిన్ సామర్థ్యం కలది. మూడో కారు భారత్ లోనే తొలి ఫేస్ లిఫ్ట్ బెంట్లీ బెంటాయిగా. ఈ కారును ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీ ఉపయోగిస్తారు. దీని ఖరీదు రూ.14.1 కోట్లు. ఈ కారు లెఫ్ట్ సీట్ డ్రైవింగ్ ను కలిగి ఉంటుంది. ఇది 5 సెకండ్లలో 100 కి.మీ ప్రయాణిస్తుంది. దీని అత్యధిక వేగం 306 కిలోమీటర్లు.

* డబ్లూ 221 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్
ఇది ఫోర్ సీటింగ్ కారు. హోండా సిటీ కారు లాగా ఉంటుంది. అంబానీ బుల్లెట్ ఫ్రూప్ కార్లలో ఇది ప్రత్యేకమైంది. దీనిని అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ ఉపయోగిస్తారు. ఇది కేవలం 6.3 సెకండ్లలో వంద కిలోమీటర్లు ప్రయాణించగలదు. దీని వెల రూ.2.78 కోట్లు ఉంటుంది. ఈ కారు గరిష్ఠ వేగం 210 కిలోమీటర్లు. రూ.కోటిన్నర విలువ గల రెండో వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.

*. రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్ హెడ్ కూపే
ఈ కారును ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ వాడుతారు. ఈ కారును ఆయన రేసుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ కారును ఇటీవలె ఆధునీకరించారు. ఫోర్ సీటింగ్ సామర్థ్యం గల ఈ కారు అంబానీ ఫ్యామిలీకి చాలా ప్రత్యేకం. 6.75-లీటర్ వి 12 పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. దీని ధర రూ.7.6 కోట్లు కాగా గరిష్ఠ వేగం 300కిలోమీటర్లు.

* రేంజ్ రోవర్ వోగ్
రేంజ్ రోవర్ ఆ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. ఈ కార్లు అనగానే సినీ నటులు, ప్రముఖులు వాడుతారనేది అందరికీ తెలుసు. కాగా ఇలాంటి కార్లు అంబానీ ఇంట్లో ఓ డజను పైనే ఉంటాయి. అంబానీ కుటుంబ  సభ్యుల్లో ఎక్కువ మంది ఈ కారును ఉపయోగిస్తారు. ముఖేష్ అంబానీ కార్లలో అత్యధికం రేంజ్ రోవర్ కార్లే. వీటిల్లో చాలా వేరియంట్లు ఉంటాయి. స్టార్టింగ్ రూ.60 లక్షల నుంచి రూ.3.47 కోట్ల వరకు ఉంటుంది.
 
* మెర్సిడెస్ బెంజ్
ఈ కారును అనంత్ అంబానీ ఉపయోగిస్తారు. దీని వెల రూ.2.42 కోట్లు ఉంటుంది. ఈ కారు 5.4 సెకన్లలో వంద కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఈ కారును 7 స్పీడ్, జిట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్మిషన్స్ గేర్ బాక్స్, విండ్ స్క్రీన్, రెయిన్ సెన్సింగ్ వైపర్లనూ కలిగి ఉంటుంది.

* బీఎండబ్లూ ఐ 8
ఈ కారునూ అనంత్ అంబానీ ఉపయోగిస్తారు. ఇది స్పోర్ట్స్ కారు. ఈ కారు లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ కలయిక గల ఈ కారు ఫోర్ యాక్సిల్ ను కలిగిఉంది. నాలుగు చక్రాలూ ఇంజిన్ నుంచి తిరిగే సామర్థ్యం కలిగి ఉంటాయి. కేవలం ఆరు సెకండ్లలో వంద కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఈ కారు గరిష్ఠ వేగం 210 కిలోమీటర్లు. దీని ధర రూ.2.62 కోట్లు.

* లంబోర్ఘిని ఉరుస్
ఈ కారు అత్యంతం శక్తివంతమైన, ఆకర్షణీయమైన కారు. ఈ కారు అత్యద్భుతమైన సూపర్ స్పోర్ట్స్ కారు. దీనిని వైల్డ్ యాక్స్ అని పిలుస్తారు. అత్యంత శబ్దం చేసే స్పోర్ట్స్ కారు ఇది. భారతదేశంలో తొలి కారును అంబానీలే కొనుగోలు చేశారు. ఆకాష్ అంబానీ ఈ కారును నడుపుతారు. దీని గరిష్ఠ వేగం 305 కిలోమీటర్లు. దీని ధర రూ.3.15 నుంచి రూ.3.45 కోట్ల వరకు ఉంటుంది. ఈ కారుని రేసింగ్ కు ఎక్కువగా ఇష్టపడతారు. అంబానీ ఇంట్లోవాళ్లందరికీ ఈ కారు అంటే అమితమైన ఇష్టం.

ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ ఇంట్లో ఉండే కారు, వాటి ధర, వేగం. ఈ కార్లలోనే ఆయన ముగ్గురు పిల్లలు తిరుగుతారు. వారి విలాస జీవితాలకు ఈ ఖరీదైన కార్లనే తార్కాణంగా చెప్పవచ్చు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లను దేశంలో తొలిసారి కొన్నది అంబానీ కుటుంబమే. అందుకే దేశంలోని అన్ని కార్లలో అంబానీ పిల్లల కార్లు వేరు. ఇక అంబానీ పిల్లలంటే ఆమాత్రం ఉంటుంది కదా మరి!
Tags:    

Similar News