అమ్మ‌బాబోయ్ః ప్రప్రంచంలో డ్ర‌గ్స్ బానిస‌లు ఇంత మందా?

Update: 2021-06-28 00:30 GMT
మ‌త్తు.. కొంద‌రికి అకేష‌న్‌. కొంద‌రికి దిన‌చ‌ర్య‌లో భాగం! ఈ మ‌త్తులోనూ ఎన్నో ర‌కాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే.. దీనివ‌ల్ల మొద‌ట్లో ఆనందం క‌లిగినా.. అంతిమంగా మాత్రం విషాద‌మే మిగులుతుంద‌న్న‌ది తెలిసిందే. ఆర్థికంగా, ఆరోగ్య ప‌రంగా అన్నీ కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తూనే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఈ మ‌త్తుకు బానిస‌య్యే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

తాజాగా.. వియ‌న్నాలోని యూఎన్ ఆఫీస్ ఆఫ్ డ్ర‌గ్స్ అండ్ క్రైమ్ గురువారం విడుద‌ల చేసిన ప్ర‌పంచ ఔష‌ధ నివేదిక ప్ర‌కారం.. గ‌త ఏడాది ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా 25 కోట్ల 70 ల‌క్ష‌ల మంది డ్ర‌గ్స్ వినియోగించార‌ట‌. వీరిలో 3 కోట్ల 60 ల‌క్ష‌ల మంది వివిధ ర‌కాల జ‌బ్బుల‌తో బాధ‌ప‌డుతున్నార‌ట‌.

వీరిలో గ‌రిష్టంగా 64 సంవ‌త్స‌రాలు మొద‌లు.. క‌నిష్టంగా 15 సంవ‌త్స‌రాల వ‌య‌సువారు కూడా ఉన్నార‌ట‌. 78 దేశాల్లోని వైద్యుల‌ను స‌ర్వే చేయ‌గా.. దాదాపు 43 శాతం మంది గంజాయి వాడుతున్న‌ట్టు తెలిపార‌ట‌. మిగిలిన వారంతా త‌మ‌కు అందుబాటులో ఉన్న ఇత‌ర‌త్రా డ్ర‌గ్స్ వినియోగిస్తున్న‌ట్టు చెప్పార‌ట‌. గ‌డిచిన పాతిక సంవ‌త్స‌రాల్లో కొన్ని దేశాల్లో గంజాయి వినియోగం ఏకంగా నాలుగైదు రెట్లు పెరిగింద‌ట‌.

కాగా.. మ‌న భార‌త్ లోనూ డ్ర‌గ్స్ వినియోగం భారీగా పెరిగింద‌ని జ‌ర్మ‌నీకి చెందిన ఏబీసీడీ అనే సంస్థ ఈ మ‌ధ్య‌నే తెలిపింది. ఈ నివేది ప్ర‌కారం..  ప్ర‌పంచంలో అత్య‌ధికంగా డ్ర‌గ్స్ తీసుకుంటున్న న‌గ‌రాల్లో అమెరికాలోని న్యూయార్క్ మొద‌టి స్థానంలో ఉండ‌గా.. పాకిస్తాన్ లోని క‌రాచీ సెకండ్ ప్లేస్ లో ఉంద‌ని తెలిపింది. ఆ త‌ర్వాత మూడో స్థానంలో.. అత్య‌ధికంగా డ్ర‌గ్స్ వాడుతున్న వారిలో భార‌తీయులే ఉండ‌డం గ‌మ‌నార్హం. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప్ర‌తీఏటా 34 వేల 708 కేజీల డ్ర‌గ్స్ ను వినియోగిస్తున్నార‌ట‌. ఒక్క న‌గ‌రంలోనే ఇంత డ్ర‌గ్స్ తీసుకుంటే.. దేశం మొత్తంలో ఎంత పీలుస్తున్నారోన‌న్న‌ది ఊహ‌కే అంద‌ట్లేదు.

ఈ డ్ర‌గ్స్ వినియోగం ద్వారా ఆరోగ్యంపై ఎన్నో దుష్ప్ర‌భావాలు చూపుతున్న‌ప్ప‌టికీ.. జ‌నాలు ప‌ట్టించుకోవ‌ట్లేదు. ప్ర‌ధానంగా యువ‌త ఈ మ‌త్తులో జోగుతోంది. త‌ల్లిదండ్రులు ఓ కంట క‌నిపెట్ట‌డం ద్వారా పిల్ల‌లు ఈ రొంపిలోకి దిగ‌కుండా చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉందని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.
Tags:    

Similar News