వారం రోజుల పాటు సాగే అమెరికా పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి వడ్డించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశారు. ప్రధాని కోసం ప్రత్యేకంగా రెండు రకాల తాలి మెనూలను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. నమో తాలి.. నమో తాలి మిఠాయి పేరుతో తయారు చేసిన మెను.. చెవులూరించేలా ఆహారపదార్థాల్ని రెఢీ చేయనున్నారు.
స్వచ్ఛమైన దేశీ నెయ్యితో ఈ వంటకాల్ని తయారు చేయనున్నారు. ఇంతకీ మోడీకి వడ్డించే ఆహార పదార్థాలన్ని హోస్టెస్ చెఫ్ కిరణ్ వర్మ రెఢీ చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి 74వ సాధారణ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రధాని మోడీ బస చేసిన హోటల్ తో పాటు.. ఆయన అమెరికాలో ఉండే అన్ని రోజులకు సరిపడా మెనూను సిద్ధం చేశారు.
నమో తాలి మిఠాయిలో రస్ మలై.. గజర్ కా హల్వా.. బాదం హల్వా.. ప్రికండ్ లు ఉండగా.. నమో తాలి సేవ్రిలో కిచిడీ.. కచోరీ.. మేతి తెప్లా లాంటి వంటలు ఉన్నాయి. పలు రాష్ట్రాలు.. నగరాల్లో ప్రాచుర్యం పొందిన వంటకాల్ని ప్రధాని మోడీ కోసం వడ్డించనున్నారు. టెక్సాస్ లో ఫేమస్ అయిన కిరణ్ వర్మ చెఫ్ గా సుప్రసిద్ధులు. ప్రధాని మోడీకి తొలిసారి ఆమె వంటకాల్ని సిద్ధం చేస్తున్నారు. మోడీకి సిద్ధం చేస్తున్న మెనూలో చాలా రకాల పచ్చళ్లను కూడా సిద్ధం చేశారు.