సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇద్దరు టీం ఇండియా ఆటగాళ్ల కెరీర్ లను నాశనం చేశాయి. పాండ్య, రాహుల్ బాలీవుడ్ నిర్మాత కాఫీ విత్ కరణ్ షోలో చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ఎంతటి దుమారంను రేపుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడవారిని అగౌరవ పర్చుతూ వారు చేసిన వ్యాఖ్యలతో జట్లులో స్థానం కోల్పోవడంతో పాటు, సమాజంలో పరువు మర్యాదలను పోగొట్టుకున్నారు. ఆ ఇద్దరిపై అంతా కూడా విమర్శలు చేస్తుండగా, కొందరు మాత్రం వారిపై సానుభూతి చూపుతూ మద్దతు పలుకుతున్నారు.
తాజాగా టీం ఇండియా మాజీ బౌలర్ శ్రీశాంత్ ఈ విషయమై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... పాండ్య, రాహుల్ లు చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా ఖండించాల్సిందే. అయితే ఆ వ్యాఖ్యల కంటే ఎక్కువ సీరియస్ వ్యాఖ్యలు చేసిన వారు కూడా ఉన్నారు. వీరిద్దరు చేసిన వ్యాఖ్యలను మరీ ఇంత సీరియస్ చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరు చేసిన తప్పుడు వ్యాఖ్యలకు షో హోస్ట్ కరణ్ జోహార్ కూడా బాధ్యత వహించాలి.
ఆ సమయంలో వారిద్దరు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టక పోవడంతో పాటు, వారు ఆ వ్యాఖ్యలు చేసేలా ప్రేరేపించింది కరణ్ జోహార్ అంటూ శ్రీశాంత్ అభిప్రాయ పడ్డాడు. కరణ్ ను శ్రీశాంత్ ఈ వివాదంలోకి లాగడంతో రచ్చ మరింతగా ముదిరింది. రాహుల్, పాండ్యాలపై మెల్ల మెల్లగా అంతా కూడా సానుభూతి చూపుతున్నారు. బీసీసీఐ కూడా వారిపై మెత్తబడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Full View