శ్రీదేవి మన నేలకు వచ్చింది. లోఖండ్‌వాలా గ్రీన్ ఏకర్స్‌లోని శ్రీదేవి నివాసానికి మీడియా కంట పడకుండా సర్వీస్ రోడ్ ద్వారా భౌతికకాయాన్ని తరలించారు. ఆమె రాకతో ముంబయి పెళ్లున రోధించింది. బాల్ థాకరే వంటి వ్యక్తికి మినహా ఇటీవల కాలంలో ముంబయిలో ఏ మరణమూ ఇంత సంచలనం కాలేదు. దుబాయ్‌లో మూడు రోజుల క్రితం చనిపోయిన శ్రీదేవి భౌతికకాయం స్వగృహానికి చేరుకోవడంతో వేలాది మంది అభిమానులు, పెద్ద సంఖ్యలో నటీనటులు గంటల తరబడి వేచి చూసి ఆమె మృతదేహం ముంబైకి చేరిన వెంటనే అనునయించారు. వారిని అదుపు చేయడానికి ముంబై పోలీసుల తలప్రాణం తోకకు వచ్చిందంటే ముంబయిలో ఆమె క్రేజు ఏంటో అర్థమవుతోంది. రేపు మధ్యాహ్నం జరిగే అంతిమ యాత్రకు ముంబయి వేదనతో సిద్ధమైంది.
ఆమె రాక కోసం, ఆమె కడచూపు దక్కుతుందేమో అని వేలాదిగా జనం ఎయిర్ పోర్టుకే వచ్చేశారు. అవకాశం దొరకదని తెలిసినా వారిని ఆ ఆలోచన ఆపలేకపోయింది. ఎయిర్‌పోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి దేహాన్ని ఇంటికి తరలించాల్సి వచ్చింది. ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్ట్ కు ఈరోజు రాత్రి 9.30 గంటల సమయంలో శ్రీదేవి భౌతిక కాయం చేరుకుంది. శ్రీదేవి భౌతికకాయం వెంట భర్త బోనీ కపూర్ - కూతురు ఖుషీ కపూర్ - సంజయ్ కపూర్ - అర్జున్ కపూర్ ఉన్నారు. ఎయిర్ పోర్ట్ దగ్గర ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ముకేశ్ అంబానీ స్వయంగా ఆ అంబులెన్సు వెంట తన వాహనంలో వచ్చారు. హైదరాబాదుకు చెందిన చాముండేశ్వరినాథ్ కూడా ఆ అంబులెన్స్ వెంట వచ్చారట.
విమానం అనిల్ ది...
అంబానీ శ్రీదేవి కోసం విమానం పంపించాడంటే చాలామంది అది ముఖేష్ అంబానీ అనుకున్నారు. కానీ అది అనిల్ అంబానీది. వ్యాపారంలో నష్టపోయి బాగా దివాలా తీసి అన్నకే కంపెనీలను అమ్ముకున్న అనిల్.. శ్రీదేవి భౌతిక కాయాన్ని తెచ్చేందుకు తన ఛార్టర్డ్ ఫ్లయిట్ ను ప్రత్యేకంగా పంపించడం విశేషం. అయితే.. అనిల్ అంబానీ ఇలా తన విమానం పంపించడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి.
అనిల్ అంబానీ గతంలోనూ తన పరిచయస్థుల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా సాయపడేవారు. సాయం చేయడంలో ఆయన ముందుంటారు. అయితే... ప్రస్తుతం శ్రీదేవి భౌతిక కాయాన్నితేవడానికి ఏకంగా తన విమానాన్నే పంపించడం వెనుక మరింత బలమైన కారణాలున్నాయి. శ్రీదేవి దుబాయిలో హాజరైన పెళ్లి బోనీ కపూర్ సోదరి కుమారుడు మోహిత్ మార్వాది. వధువు ఎవరో ఇంతవరకు మీడియాలో చర్చకు రాలేదు. ఆ అమ్మాయి పేరు ఆంత్రా మోతివాలా. ఆమె, మాజీ నటి టీనా మునిమ్‌కు దగ్గరి బంధువు. టీనా తోబుట్టువు కూతురే ఆంత్ర. టీనా ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె, అనిల్ భార్య. అదీ సంగతి. అంటే, పెళ్లికూతురు అనిల్ అంబానీకి అత్యంత సమీప బంధువు. పైగా ముంబయిలో బాలీవుడ్, బడా బిజినెస్ ఫ్యామిలీస్ మధ్య సన్నిహిత సంబంధాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కలిసి అనిల్ అంత శ్రద్ధ తీసుకోవడానికి కారణమయ్యాయన్నమాట.