ప‌దవికి రాజీనామా చేసిన అధికార ఎంపీ

Update: 2015-06-11 14:04 GMT

వ‌రంగ‌ల్‌ పార్లమెంటు స‌భ్యుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాస‌న‌మండ‌లి స‌భ్యుడిగా గెలుపొంద‌డంతో క‌డియం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు సమర్పించారు. 

క‌డియం రాజీనామా చేయ‌డంతో ఆరునెల‌ల్లో వ‌రంగ‌ల్ పార్లమెంటు స్థానానికి ఆరునెలల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే టీఆర్ఎస్ లో ఆశావ‌హ‌ల సంద‌డి మొద‌లైంది. ప్ర‌తిప‌క్ష టీడీపీ, కాంగ్రెస్‌లు సైతం అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాయి. 2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి క‌డియం శ్రీ‌హ‌రి టీఆర్ఎస్ తరపున గెలిచారు. తెలంగాణ డిప్యూటీ సీఎంగా పనిచేసిన తాటికొండ రాజయ్య అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయడంతో కడియం శ్రీహరికి మంత్రి పదవికి దక్కింది.

Tags:    

Similar News