ఏపీలో రోజురోజుకి కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కేసుల సంఖ్య 40వేల మార్క్ దాటింది. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు ఈ వైరస్ సోకింది. ఇప్పుడు ఎమ్మెల్యేలను కూడా వదలడం లేదు. నిన్న శ్రీశైలం ఎమ్మెల్యేకు కూడా కరోనా వ్యాపించినట్టు వార్తలు వచ్చాయి.
తాజాగా ఇప్పుడు మరో ఏపీ ఎమ్మెల్యేకు కూడా కరోనా సోకినట్టు తెలిసింది. వైసీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా వచ్చినట్టు సమాచారం. ఆయన భార్యకు కూడా కరోనా సోకినట్టు తెలిసింది.
ఇక ఎమ్మెల్యేకు పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులతోపాటు ఆయనతో ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారో వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఏపీలో శుక్రవారం కొత్తగా 2602 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 2500 దాటుతోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40646కి చేరింది. గడిచిన 24 గంటల్లో 42మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 534కు చేరింది.