ఆంధ్రప్రదేశ్ రాజకీయం గత కొన్ని రోజులుగా రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ చుట్టూనే తిరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నియామకం రాష్ట్ర మంత్రి మండలి సిఫారసు మేర జరగడానికి కుదరదు అని, పూర్తిగా రాష్ట్ర గవర్నర్ విచక్షణ మేరకే జరగాలంటూ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఓ కీలక మలుపు తిరిగింది. తాజాగా నిమ్మగడ్డ రమేశ్ నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. ఇప్పటికే నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలపై జగన్ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
గుంటూరు జిల్లా ఉప్పలపాడు కు చెందిన శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో ఈ కోవారెంట్ పిటిషన్ దాఖలు చేశారు. రమేష్ కుమార్ వ్యవహారంలో ఇదివరకు హైకోర్టు ఇచ్చిన తీర్పులో కొన్ని సాంకేతిక పరమైన లోపాలు ఉన్నాయని , దాన్ని ఆధారంగా చేసుకుని చూస్తే హైకోర్టు ఆదేశాలు పునః సమీక్షించాల్సి ఉంటుందని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ 2016లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో 11ను కొట్టేయాలని కోరుతూ గుంటూరు జిల్లా, ఉప్పలపాడు గ్రామానికి చెందిన సంగం శ్రీకాంత్ రెడ్డి కోవారెంట్ పిటిషన్ ను దాఖలు చేశారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించాలని 2016 లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారధ్యంలోని మంత్రివర్గం గవర్నర్ కి సిఫార్సు చేసింది. దీని ఆధారంగా రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. బాధ్యతలను స్వీకరించిన తేదీ నుంచి ఐదేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. ఎన్నికల కమిషన్ అనేది చట్టబద్ధత గల స్వతంత్ర సంస్థ. అయితే, తాజాగా చోటుచేసుకున్న పరిణామాలలో రమేష్ కుమార్ ను తప్పించి మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనకరాజు ను నియమిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి , సారథ్యంలోని మంత్రివర్గం గవర్నర్ కి సిఫార్సు చేసింది.
దాన్ని ఆర్డినెన్స్ రూపంలో అమల్లోకి తీసుకు వచ్చారు గవర్నర్. ఆర్డినెన్స్ ను జారీ చేయగల అధికారం రాజ్యాంగబద్ధంగా గవర్నర్ కి ఉంది. దాన్ని వినియోగించుకుని గవర్నర్ ఈ ఆర్డినెన్స్ను తీసుకు వచ్చారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకి తగ్గించినట్టు ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్గా పునర్నిర్మించాలని ఆర్డినెన్స్ జారీ చేయాలంటూ తాజాగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. చట్టబద్ద సంస్థ కమిషనర్ గా జస్టిస్ కనకరాజు మంత్రివర్గ సిఫార్స్ చేయడం వెంటనే విషయాన్ని హైకోర్టు అభిప్రాయ పడింది. మంత్రివర్గ సిఫారసు చేసిన ఆయన నియామకం చెల్లదని పేర్కొంది. సరిగ్గా ఇదే పాయింట్ మీద శ్రీకాంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. చూడాలి మరి హైకోర్టు దీనిపై ఎలా స్పందిస్తుందో ..