ఉన్నత చదువుల కోసమో.. ఉద్యోగం కోసమో.. ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లి అక్కడ ప్రమాదానికి గురైతే ఆ వ్యక్తికి చెందిన కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం. విదేశఆల్లో ఇలా ప్రమాదాలకు గురై అసువులు బాసిన తెలుగు వాళ్లు చాలామందే ఉన్నారు. ఇప్పుడు మరో తెలుగుమ్మాయి అమెరికాలో ప్రాణాలతో పోరాడుతోంది. న్యూయార్క్ యూనివర్శిటీలో ఎమ్మెస్ చదవడం కోసం వెళ్లిన శ్రీలేఖ అనే తెలుగమ్మాయి న్యూయార్క్ లో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె రోడ్డు దాటుతుండగా.. కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి.
శ్రీలేఖను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమెను ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. శ్రీలేఖ ఖమ్మం జిల్లా మధిరకు చెందిన అమ్మాయి. ఆమె మూడు నెలల కిందటే ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లింది. ఇంతలోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. శ్రీలేఖ తల్లిదండ్రుల పేర్లు సురేష్, సుమతి. వాళ్లిద్దరికీ ఈమె ఒక్కతే సంతానం. శ్రీలేఖకు జరిగిన ప్రమాదం గురించి తల్లిదండ్రులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుసింది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ వారితో మాట్లాడినట్లు సమాచారం. తమ కూతురికి సరైన వైద్యం అందేలా చూడాలని వారు మంత్రిని కోరారు.