నాని.. నీకు హైదరాబాద్ లో రెండు ఇళ్లు ఉన్నాయ్.. శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్
మొన్నటి వరకు లేని జల జగడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త కాక రేపుతోంది. రెండు వారాల క్రితం నిర్వహించిన కేబినెట్ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాజెక్టును ప్రస్తావించటం.. తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బ తీస్తుందని గళం విప్పటం తెలిసిందే. అప్పటి నుంచి తెలంగాణ అధికార.. విపక్ష నేతలు పలువురు రాయలసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. ఏపీ కారణంగా జరుగుతున్న నష్టాల్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు.
ఈ క్రమంలో దివంగత మహానేత వైఎస్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలతో పాటు.. ఘాటు విమర్శలు చేశారు. జల దొంగ అని ఒకసారి.. నరరూప రాక్షసుడని మరో సందర్భంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ నేతలు. మొదట్లో ఆచితూచి అన్నట్లుగా మాట్లాడిన ఏపీ నేతలు.. గులాబీ నేతల మాటల జోరు పెరిగే కొద్దీ.. వారు స్పందించక తప్పని పరిస్థితి. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
మంత్రి నానికి హైదరాబాద్ లో రెండు ఇళ్లు ఉన్నాయని.. ఆయన ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. ఆయన ఆస్తులు.. వ్యాపారాల గురించి ప్రస్తావించిన శ్రీనివాస్ గౌడ్.. ‘కనీసం ఆలోచించి మాట్లాడాలి కదా?’ అని వ్యాఖ్యానించటం గమనార్హం. అదే సమయంలో తమ వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తున్న సి. రామచంద్రయ్యను వదల్లేదు శ్రీనివాస్ గౌడ్. వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడొద్దన్న మంత్రి.. ‘ఇక్కడ తింటూ.. అక్కడి మాట మాట్లాడితే తలెంగాణ ప్రజలు మీ గురించి ఆలోచన చేసే పరిస్థితి ఏంటి? అంటూ వ్యాఖ్యానించారు.
తమ పదవులు పోయినా.. ప్రాణాలు పోయినా ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టును అడ్డుకుంటామన్న శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దేశంలో ఎవరికి ఎక్కడైనా ఆస్తులు ఉండొచ్చు. అంత మాత్రాన.. ఫలానా చోట ఆస్తులు ఉన్నాయి కాబట్టి.. తమ వాదనను వినిపించొద్దని బెదిరించటం ఏమిటన్నది ప్రశ్న. రాజకీయాలు వేరు.. వ్యక్తిగత అంశాలు వేరు. తెలంగాణ ప్రయోజనాల పేరుతో ఇలాంటి హెచ్చరికలపై నోరు విప్పకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని వ్యాఖ్యలు చేసే వీలుందన్న మాట వినిపిస్తోంది.