విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్‌కు సంబంధించి కొత్త విషయం ఒకటి బయటకు వచ్చింది. శ్రీనివాస్ కు సంబంధించిన కొత్త విషయాలతో పాటు... కత్తి దాడి జరిగిన సమయంలో శ్రీనివాస్ ఏం చేశాడు? అన్న విషయాన్ని క్యాంటీన్ యజమాని హర్షవర్దన్ ఒక మీడియా సంస్థకు వెల్లడించారు.
శ్రీనివాస్ ఉదయం 5 గంటలకు డ్యూటీకి వచ్చి పదకొండు గంటలకు వెళ్లిపోతాడని.. తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లిపోతాడని పేర్కొన్నారు. మొదట డ్యూటీ దిగిన తర్వాత మధ్యాహ్న భోజనం క్యాంటీన్ లోనే పెడతారు. తర్వాత దగ్గర్లోని తన గదికి వెళ్లి వస్తాడు. లేదంటే ఎయిర్ పోర్ట్‌లోనే అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు.
జగన్ పై దాడి జరిగిన రోజున శ్రీనివాస్ అప్పటికే డ్యూటీ దిగిపోయాడట. డ్యూటీ దిగిన తర్వాత యూనిఫామ్ మార్చుకోవటానికి క్యాంటీన్ లో ఎలాంటి వసతి లేకపోవటంతో ... యూనిఫాంతోనే తిరుగుతుంటాడని చెప్పారు. ఆ రోజు ఉదయం 11.30 గంటలకు బయటకు వెళ్లిన శ్రీనివాస్ తర్వాత లోపలకు వచ్చినట్లు చెప్పాడు.
ఆ రోజు వీఐపీ లాంజ్ లో ఉన్న జగన్ కు సర్వర్ రమాదేవి కాఫీ ఇచ్చారన్నారు. సూపర్ వైజర్ సతీశ్ కూడా ఉన్నారన్నారు. శ్రీనివాస్ యూనిఫామ్ లోనే ఉండటంతో సులువుగా వీఐపీ లాంజ్ లోకి వెళ్లిపోయినట్లు చెప్పారు. ఈ కారణంతోనే ఎవరూ అడ్డుకోలేదని చెబుతున్నారు.