ప‌ళ‌ని స‌ర్కారు 14లోపే కూలిపోతుందా?

Update: 2017-06-07 06:57 GMT
త‌మిళ‌నాడు అధికార‌ప‌క్షంలో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. నిన్న‌టి వ‌ర‌కూ రెండుగా ఉన్న వ‌ర్గాలు.. దిన‌క‌ర‌న్ పుణ్య‌మా అని మూడుగా మార‌టం.. ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామితో పొస‌గ‌క‌పోవ‌టం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది.

ఇదిలా ఉంటే.. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో డీఎంకే కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ నెల 14న రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు షురూ కావాల్సి ఉంది. అప్ప‌టివ‌ర‌కైనా ప‌ళ‌నిస్వామి ప్ర‌భుత్వం అధికారంలో ఉంటుందా? అన్న‌ది అనుమాన‌మేన‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌తిప‌క్షానికి చెందిన కీల‌క నేత‌.. తేదీ చెప్పి మ‌రీ ప్ర‌భుత్వం ఉంటుందా? అని ప్ర‌శ్నిస్తున్న తీరు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఒక‌వేళ ప్ర‌భుత్వం ఉంటే త‌మ ప‌ని తాము చేసుకుంటూ పోతామంటూ స్టాలిన్ చేసిన‌ వ్యంగ్య వ్యాఖ్య‌లు త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కొత్త చ‌ర్చ‌కు తెర తీసింది. అధికార‌ప‌క్షం ఇప్ప‌టికే మూడు ముక్క‌లైంద‌ని.. భ‌విష్య‌త్తులో ఎన్ని ముక్క‌లు అవుతుందో ఊహించ‌టం కూడా క‌ష్ట‌మంటూ అధికార‌ప‌క్షంలోని లోపాన్ని ఎత్తి చూపే ప్ర‌య‌త్నం చేశారు. మొత్తంగా చూసిన‌ప్పుడు.. ప‌ళ‌నిస్వామి ప్ర‌భుత్వానికి నూక‌లు చెల్లిపోయాయా? అన్న సందేహం క‌లిగేలా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News