నల్లబిల్లులతో నల్లధనం తెల్లగా..

Update: 2016-11-18 09:51 GMT
నోట్ల రద్దు తరువాత నల్లధనాన్ని తెల్గగా మార్చుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో ఎత్తుగడ వేస్తున్నారు. ఇందుకు ఆర్థికవేత్తలు - ఆడిటర్లే కాదు.. మామూలు వ్యాపారులు కూడా తమ బుర్రకు పదును పెట్టి బ్లాక్ మనీని వైట్ చేసేస్తున్నారు.. ఈ క్రమంలో బెంగుళూరులోని ఒక హోటల్ వేసిన ఎత్తుగడ సోషల్ మీడియాకు ఎక్కడంతో ఔరా అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అదే సమయంలో అరె మనకు ఈ ఐడియా రాలేదే అనుకుంటూ చాలామంది అదే ఎత్తుగడను ఫాలో అయిపోవడానికి రెడీ అయిపోయారు.

బెంగుళూరులోని చర్చి స్ట్రీట్లో ఉన్న ఆడిగస్ హోటల్  పాపులర్ హోటల్లలో ఒకటి. అయితే.. మిథున్ నోబెల్ అనే వ్యక్తి ఆ హోటల్ బ్లాక్ మనీ మార్చుకోవడానికి జనాన్ని ఎలా బురిడీ కొట్టిస్తోందో గుర్తించి దాన్ని ఫేస్ బుక్ లో పెట్టాడు. వినియోగదారులతో పాత తేదీలతో బిల్లులు ఇవ్వడం ద్వారా తమ బ్లాక్‌మనీని వైట్‌ చేసుకునేందుకు ఆ హోటల్‌ ప్రయత్నిస్తున్నదని మిథున్‌ ఆరోపించాడు.

రీసెంటుగా ఆయన అక్కడ ఫుడ్‌ ఆర్డర్‌ చేసేందుకు ఆయన ఆడిగస్‌ హోటల్‌ కు వెళ్తే అక్కడ కార్డు పేమెంట్ తీసుకోవడానికి నిరాకరించారట. క్యాష్ అయితేనే తీసుకుంటామని చెప్పారట. డబ్బు చెల్లించి బిల్లు తీసుకున్న తరువాత ఆయన అందులోని తేదీ చూసి షాకయ్యారు.  1/09/2016 తేదీకి వారు బిల్‌ ఇచ్చారు. నల్లధనాన్ని మార్చుకునే తెలివైన ఎత్తుగడ ఇది.  అమ్మకాల ఖాతాలో మార్పులు చేసి.. పాత తేదీలతో బ్లాక్‌ మనీని వైట్‌ చేసుకునే ప్రయత్నం ఇది. అయితే.. నోట్ల రద్దు తరువాత అంతా క్యాష్ తీసుకోవడానికి వెనక్కు తగ్గుతున్న టైంలో కార్డు పేమెంట్ వద్దనడంతో అనుమానించిన మిథున్ బిల్లును పరిశీలించగా ఈ నాటకం బయటపడింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News