సారు హ‌యాంలో రూ.ల‌క్ష కోట్లు అప్పు చేశార‌ట‌!

Update: 2019-05-22 05:24 GMT
అర‌వై ఏళ్లు క‌లిసి కాపురం చేసిన తెలంగాణ‌.. ఆంధ్ర రాష్ట్రాలు మొత్తంగా చేసిన అప్పులో తెలంగాణ వాటా కింద ప‌డిన అప్పు భారం రూ.82వేలు కోట్లు. మ‌రి.. గ‌డిచిన ఐదేళ్ల‌లో కేసీఆర్ స‌ర్కారు చేసిన అప్పు ఎంతో తెలుసా?  జ‌స్ట్.. రూ.ల‌క్ష కోట్లు. ఇదంతా ఉత్త గ్యాస్.. సారు లాంటి అప‌ర‌మేధావి సీఎంగా ఉంటే.. ఇంతేసి అప్పులు సాధ్య‌మా? అన్న సందేహం అక్క‌ర్లేదు. ఇప్పుడు చెప్పిన లెక్క మా సొంత‌మో.. విప‌క్షాల విమ‌ర్శో కాదు. తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు నోటి నుంచి ప‌చ్చి నిజం.

తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి మీద ప‌డిన అప్పు రూ.82వేల కోట్లు అయితే.. గ‌డిచిన ఐదేళ్ల‌లో చేసిన అప్పు రూ.ల‌క్ష కోట్లు.. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర అప్పు రూ.1.82 ల‌క్ష‌ల కోట్లుగా తేల్చారు. తాము చేసిన రూ.ల‌క్ష కోట్ల అప్పు చ‌ట్ట‌బ‌ద్ధంగా చేశామ‌ని.. నిబంధ‌న‌ల్ని తూచా త‌ప్ప‌కుండా తీసుకొచ్చామ‌న్న మాట‌ను ఆయ‌న చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై తాజాగా మాట్లాడిన ఆయ‌న‌.. ఉద్యోగుల‌కు వేత‌నాలు.. ఆస‌రా పెన్ష‌న్లు.. ప్రాజెక్టుల బిల్లులు.. సంక్షేమ ప‌థ‌కాల‌కు నిధుల‌ను స‌కాలంలో చెల్లిస్తున్న‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. ఆర్థిక వృద్ధిరేటు న‌మోదులో తెలంగాణ దేశంలోనే అగ్ర‌స్థానంలో నిలిచింద‌న్న ఆయ‌న‌.. స్టేట్ ఓన్ ట్యాక్స్ లోనూ తెలంగాణ నంబ‌ర్ వ‌న్ గా నిలిచింద‌ని వ్యాఖ్యానించారు. మిష‌న్ భ‌గీర‌థ ప్రాజెక్టు మొత్తం వ్య‌యం రూ.46,960 కోట్లు కాగా.. ఇప్ప‌టివ‌ర‌కూ ప్రాజెక్టుల‌పై చేసిన ఖ‌ర్చు రూ.27,509 కోట్లుగా పేర్కొన్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు నిధుల కొర‌త లేద‌ని స్ప‌ష్టం చేసిన ఆయ‌న‌.. పింఛ‌న్ల‌కు అవ‌స‌ర‌మైన నిధులు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని.. రైతుబంధు కోసం ర‌బీలో రూ.5200 కోట్లు విడుద‌ల చేసిన‌ట్లుగా చెప్పారు.

ఆదాయం పెరుగుతున్న‌ప్పుడు ఖ‌ర్చు పెర‌గ‌టం స‌హ‌జ‌మేన‌ని.. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న బిల్లులు కేవ‌లం రూ.3474 కోట్లు మాత్ర‌మేన‌ని వివ‌రించారు. ఎఫ్ ఆర్ బీఎం 2004 ప్ర‌కారం జీడీపీలో 3 శాతం రుణాలు తీసుకోవ‌చ్చ‌ని.. ఈ ఏడాది రూ.29,750 కోట్లు తీసుకోవ‌టానికి అనుమ‌తి ఉంద‌న్నారు. నిధులు స‌మృద్ధిగా ఉన్నా.. ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా చెల్లింపుల్లో జాప్యం జ‌రిగిన మాట నిజ‌మేని ఆయ‌న ఒప్పుకోవ‌టం గ‌మ‌నార్హం. మామూలుగానే చిన్న విమ‌ర్శ‌ను సైతం చీల్చి చెండాడే కేసీఆర్ స‌ర్కార్.. బిల్లుల చెల్లింపులో ఆల‌స్యాన్ని ఒప్పుకోవ‌టం ఒక ఎత్తు అయితే.. అంత‌లా ఒప్పుకున్నారంటే.. వాస్త‌వంలో మ‌రెంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఉంద‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సంప‌న్న రాష్ట్రం సుసంప‌న్నంగా ఉండ‌కుండా ఇలా అప్పులపాలు కావ‌టం ఏంది కేసీఆర్ ?


Tags:    

Similar News