అలా పరిశోధిస్తే కరోనాను నాశనం చేయొచ్చు!

Update: 2020-08-09 12:36 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు మందు లేక.. వ్యాక్సిన్ రాక జనాలు పిట్టల్లా రాలుతున్నారు. కొంతమందికి తీవ్ర లక్షణాలతో ఆస్పత్రుల పాలవుతుండగా.. మరికొందరికి అసలు లక్షణాలే లేకున్నా కరోనా నిర్ధారణ అవుతోంది. 40శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ గా వస్తోందని కాలిఫోర్నియా అంటు వ్యాధుల నిపుణురాలు మోనికా గాంధీ తెలిపారు.

ఇక తీవ్ర లక్షణాలు ఉన్న వారితో కలిసుకున్న వారికి కూడా కరోనా వైరస్ సోకలేదని తమ అధ్యయనంలో తేలిందని పరిశోధకురాలు మోనికా తెలిపారు. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల వారికి సోకలేదా? లేక కరోనా తీవ్రత తగ్గడం వల్ల రాలేదా అన్నది మిస్టరీగా మారిందని ఆమె తెలిపారు.

కాగా ఈ మిస్టరీని చేధిస్తే వ్యాక్సిన్ అభివృద్ధిని వేగవంతం చేయవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.రోగ నిరోధక శక్తికి కొత్త మార్గాలు తెలుస్తాయని ఆమె తెలిపారు. ఆ దిశగా ప్రయోగాలు చేస్తే కరోనాకు అడ్డుకట్ట వేయడంతోపాటు దానిని నాశనం చేయవచ్చని ఆమె పేర్కొన్నారు.


Tags:    

Similar News