ఓటుకు నోటు వ్యవహారంలో ఎవరేం మాట్లాడారు? ఎవరు డబ్బు ప్రస్తావన తీసుకొచ్చారు? ఎవరు డబ్బు అడిగారు? లాంటి విషయాలకు జవాబులు చెప్పే ఎఫ్ ఎస్ ఎల్ నివేదిక తమ వద్ద ఉందని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ పేర్కొంది.
ఈ ఛానల్ వాదన ప్రకారం.. తమ వద్దనున్న ఎఫ్ ఎస్ ఎల్ నివేదిక ప్రకారం.. ఓటుకు నోటు కేసులో రేవంత్.. స్టీఫెన్ సన్.. సెబాస్టియన్ ల మధ్య ఏం జరిగింది..? వీరి సంభాషణలు ఎలా జరిగాయి? మొదట డబ్బు ప్రస్తావన తెచ్చింది ఎవరన్న విషయంపై ఒక స్పష్టత వచ్చిందని చెబుతున్నారు.
ఈ ఛానల్ వాదన ప్రకారం.. మొదట డబ్బు గురించి అడిగింది స్టీఫెన్ సన్ అన్నట్లుగా చెబుతోంది. తాను మొదటసారి ఇలాంటి పనులు చేస్తున్నానని.. తాను చిన్న వ్యాపారం చేసుకుంటున్నట్లు.. తనను మీరే బాగా చూసుకోవాలంటూ రేవంత్ ను స్టీఫెన్ సన్ కోరినట్లుగా టేపులు ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనికి రేవంత్ రూ.2.5కోట్లు ఇస్తనని చెప్పినట్లుగా టేపుల్లో ఉన్నట్లుగా.. తమ చేతికి వచ్చిన టేపులు నిజమైనవేనని ఎఫ్ ఎస్ ఎల్ చెప్పిందని పేర్కొంది. ఓటుకు నోటు విచారణకు ఈ నివేదిక కీలకం కానుందని చెబుతున్నారు. ఇప్పటివరకూ డబ్బు ప్రమేయం తెచ్చింది రేవంత్ అన్న ఆరోపణలకు.. మొదట డబ్బు అడిగింది స్టీఫెన్ అన్నట్లుగా నివేదిక నిర్దారిస్తే.. కేసు ఏ మలుపు తిరుగుతుందని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.