విరాట్ కోహ్లీ '18' జెర్సీ నంబర్ కథ ఇదీ

Update: 2023-03-27 06:00 GMT
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్‌లలో ఒకరిగా పరిగణించబడతాడు. రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023లో తిరిగి చురుకుగా పాల్గొనబోతున్నాడు. టీమిండియా జాతీయ జట్టుకు ఆడినా.. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ ఎప్పుడూ జెర్సీ నంబర్ 18 ధరించి కనిపిస్తాడు.

విరాట్ కోహ్లి టీమ్ ఇండియాలో ఎంపికైనప్పుడు, 18వ నంబర్ జెర్సీ ఖాళీగా ఉంది. దీంతో  పెద్దగా ఇబ్బంది పడకుండా ఆ నంబర్‌ను పొందాడు. 2008లో విరాట్ కోహ్లీ భారత అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా అతను జెర్సీ నంబర్ 18 ధరించాడు.

జెర్సీ నంబర్ 18తో విరాట్ కోహ్లీకి ఉన్న ప్రేమ, అనుబంధం వెనుక కారణం చాలా భావోద్వేగంతో కూడి ఉంది. అది ఆయన వ్యక్తిగతమైనదగా చెప్పొచ్చు.

విరాట్ కోహ్లీకి కేవలం 17 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు అతని తండ్రి డిసెంబర్ 18, 2006న మరణించాడు. విరాట్ తన తండ్రి చనిపోయినప్పుడు కర్ణాటకతో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ తరపున ఆడుతున్నాడు.

ఆ తర్వాత జరిగిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్ధమాన క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చింది. తన తండ్రి మరణించిన మరుసటి రోజు, విరాట్ కర్ణాటకతో మ్యాచ్ ఆడటం కొనసాగించాడు. ఆ మ్యాచ్‌లో 90 పరుగులు చేసి అతని జట్టు ఫాలో-ఆన్‌ను నివారించడంలో సహాయం చేశాడు.

అలా తండ్రి మరణించిన రోజు కూడా ఆగస్టు 18నే. అలా అని కోహ్లీ తన జెర్సీ నంబర్ 18ని ఎప్పుడూ అడగలేదు. అండర్ 19 మ్యాచ్ ఆడినప్పుడు 18వ నంబర్ ఇచ్చారు. ఇక టీమిండియాలోకి విరాట్ కోహ్లీ ఎంట్రీ కూడా ఆగస్టు 18నే జరిగింది. దురదృష్టవశాత్తూ కోహ్లీ నాన్న కూడా 18వ తేదీనే మరణించారు. అలా యాదృశ్చికంగా 18వ సంఖ్య నాతో నిలిచిపోయిందని కోహ్లీ తెలిపాడు.         


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News