కరోనాకు చెక్ పెట్టేందుకు వీలుగా వరుస పెట్టి వ్యాక్సిన్లు వచ్చేస్తున్న వేళ.. ఇక అన్ని మంచిరోజులే అన్న భావన మనసులోకి వస్తున్న వేళ.. అలాంటిది ఇప్పట్లో సాధ్యం కాదన్న సందేశాన్ని ఇచ్చేలా యూకేలో కొత్త వైరస్ వెలుగు చూడటం.. ఇది ఆ దేశంతో పాటు.. పలు దేశాల్ని ఇబ్బంది పెట్టటం తెలిసిందే. కరోనా చేదు అనుభవం నేపథ్యంలో.. యూకేలో వెలుగు చూసిన కొత్త వైరస్ ను తమ దేశాల్లోకి రాకుండా ఉండేందుకు.. ఆ దేశంతో ఉండే విమాన సర్వీసుల్ని ఎవరికి వారు నిలిపివేయటం తెలిసిందే.
అయినప్పటికి బ్రిటన్ ను వివిధ దేశాలకు వెళ్లిన వారి పుణ్యమా అని కొత్త వైరస్ పాకుతోంది. తాజా అంచనాల ప్రకారం కొత్త వైరస్ 30 దేశాలకు పాకిపోయినట్లుగా చెబుతున్నారు. కరోనా వైరస్ తోపోలిస్తే.. తాజా స్ట్రెయిన్ చాలా వేగంగా వివిధ దేశాలకు పాకిపోవటం గమనార్హం. ఒకవైపు వ్యాక్సినేషన్ జరుగుతున్న వేళలోనే కొత్త వైరస్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. దీంతో.. ఈ కొత్త వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు వీలుగా చర్యలు షురూ చేశారు.
తాజాగా వియత్నాంలో కొత్త వైరస్ కు సంబంధించి తొలి కేసు నమోదైంది. యూకే నుంచి తిరిగి వచ్చిన మహిళలో కొత్త వైరస్ లక్షణాలు కనిపించినట్లుగా గుర్తించారు. వెంటనే ఆమెను ఐసోలేషన్ కు పంపారు. భారత్ లో ఇప్పటివరకు 29 కేసులు నిర్దారణ కాగా.. విమాన సర్వీసుల విషయంలో ఆంక్షలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాలోని మూడు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ జాడలు వెలుగు చూశాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొత్త వైరస్ ఇప్పటికే అమెరికాను భారీగా చుట్టేసి ఉంటుందని భావిస్తున్నారు.
జన్యుక్రమ విశ్లేషణ పరీక్షల సామర్థ్యం తక్కువగా ఉండటంతో కొత్త వైరస్ ను గుర్తించటం కష్టమవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా ఆ దేశం తీవ్రంగా ప్రభావితమైంది. కొత్త వైరస్ తీవ్రత పెరిగితే.. అమెరికాకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే.. ఇప్పటికే ఆ దేశంలోని ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లతో నిండి ఉంది. ఓవైపు వ్యాక్సిన్ జోరుగా వేస్తున్నా.. అందరికి టీకా అందే లోపు.. కొత్త.. పాత వైరస్ లు వ్యాపించటం ఇబ్బందికరంగా మారింది.