లారీ డ్రైవర్లకు శుభవార్త చెప్పిన NHAI..ఏంటంటే!

Update: 2020-04-20 11:36 GMT
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడి కోసం కేంద్ర  - రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మార్చి 24 నుంచి 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. అయితే , ఈ లాక్ డౌన్ గడువు ముగిసే సమయానికి దేశంలో కరోనా తగ్గుముఖం పట్టకపోగా ..మరింతగా విజృంభించింది. ఈ తరుణంలో మరోసారి మే 3 వరకు లాక్ డౌన్ ను పొడగిస్తునట్టు ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్నందున - దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర సరిహద్దులను మూసివేసాయి. ఎవరినీ తమ రాష్ట్రాలలోకి ప్రవేశించడానికి అనుమతించడం లేదు. ట్రక్ డ్రైవర్లు మరియు సహాయకులకు ఇది పెద్ద సమస్యగా మారింది. దీనితో ట్రక్ డ్రైవర్లు ఎక్కడికక్కడ రహదారులపై ఒంటరిగా , ఆకలితో అలమటిస్తూ అలాగే  ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా ఉన్న ట్రక్ డ్రైవర్లు మరియు సహాయకుల కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని ఏర్పాట్లు చేస్తోందని సమాచారం.

ఇందులో భాగంగా .. నేషనల్ హైవే నెట్‌ వర్క్‌ లో విస్తరించి ఉన్న 1,7000 ఇంధన స్టేషన్లలో ట్రక్ డ్రైవర్లకు ఆహార ఏర్పాట్లు చేస్తోంది. 1,700 ఇంధన కేంద్రాలతో పాటు - ఎన్‌ హెచ్‌ ఏ ఐ ఇలాంటి ఏర్పాట్లు చేయడానికి మరో 148 ప్రదేశాలను కూడా ఏర్పాటు చేస్తోంది. భారత్ పెట్రోలియం - హిందూస్తాన్ పెట్రోలియం మరియు ఇండియన్ ఆయిల్ నడుపుతున్న ఇంధన కేంద్రాల జాబితాను రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అక్కడ లారీ డ్రైవర్లకు ఆహారం ఏర్పాటు చేయబోతున్నారు.  అలాగే  కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు హైవేలపై ఉన్న డాబాలు మరియు రిపేర్ దుకాణాల జాబితాను కూడా అందిస్తున్నాయి. వీటిని కూడా  ట్రక్ డ్రైవర్లు మరియు వారి సహాయకులు ఉపయోగించుకోవచ్చు అని తెలిపింది.

లాక్ డౌన్ వల్ల ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన ట్రక్ డ్రైవర్లకు ఆహారాన్ని అందించడానికి ఏర్పాటు చేసిన సౌకర్యాల జాబితాను మంత్రిత్వ శాఖ వెబ్‌ సైట్‌ లో విడుదల చేశారు. ఆహారం ఎక్కడ దొరుకుతుందో ఖచ్చితమైన అడ్రస్ మరియు మొబైల్ నెంబర్ వంటి కూడా అందులో పొందుపరిచినట్టు తెలిపింది.  ఇప్పటికే ఉన్న నివేదికల ప్రకారం ట్రక్కులు తీసుకువెళుతున్న 3.5 లక్షల అంతర్-రాష్ట్ర వస్తువులు రహదారులపై చిక్కుకు పోయాయి. ఈ ట్రక్కులలో దాదాపు రూ. 35,000 కోట్ల విలువైన వస్తువులు ఉన్నాయని కేంద్రం అంచనావేస్తుంది.
Tags:    

Similar News