ఏపీలో పీకే శిష్యుల వ్యూహాలు.. ఎవ‌రిది గెలుపు!

Update: 2022-11-21 10:40 GMT
ఏపీలో రాజకీయాలు ప్ర‌ధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన‌ల మ‌ధ్య సాగుతున్నా.. అంత‌ర్గ‌తంగా త‌ర‌చి చూస్తే మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో జాతీయ రాజ‌కీయాల వ్యూహ‌కర్త‌ ప్ర‌శాంత్ కిషోర్ ఉర‌ఫ్ పీకే శిష్యుల మ‌ధ్యే పోటీ ఉండే క‌నిపిస్తోంది. అధికారంలో ఉన్న వైసీపీ, పీకే శిష్యుడు రిషిరాజ్‌ను వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకున్న విష‌యం తెలిసిందే. ఈయ‌న ఐప్యాక్ ద్వారా వ్యూహాలు అందిస్తున్నారు.

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం అన్నా, గెలుపుగుర్రాల‌కే టికెట్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించినా, ప్ర‌జ‌ల‌కు సంక్షేమాన్ని ఇంటింటికీ చేరుస్తున్నా, బ‌ట‌న్ నొక్కు డు కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడుతున్నా.. దాదాపు రిషి రాజ్ సూచ‌న‌ల‌మేర‌కే ఇవ‌న్నీ చేస్తున్నార‌నేది వాస్త‌వం. దీంతో ఆయ‌న పథ‌కాల ప్ర‌కారం ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వైసీపీ నాయ‌కులు వెళ్తున్నారు. రేపు వైసీపీ వ‌న్స్‌మోర్ విజ‌యం ద‌క్కించుకుంటే, ఈ టీంకే ఆ గెలుపు ఫ‌లితం వెళ్తుంద‌నేది స్ఫ‌ష్ట‌మ‌వుతోంది.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం  టీడీపీ కూడా 40 ఏళ్ల పొలిటిక‌ల్ హిస్ట‌రీలో ఎప్పుడూ వ్యూహ‌క‌ర్త‌ను నియ‌మించుకున్న ప‌రిస్థితి లేదు. అయితే, మారుతున్న రాజ‌కీయాల‌కు అనుగుణంగా తాము కూడా మారాల‌నుకున్నారో ఏమో చంద్ర‌బాబు పీకే మ‌రో శిష్యుడు రాబిన్ శ‌ర్మను వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకున్నారు. ఈయన ఇచ్చిన స‌ల‌హా మేర‌కే బాదుడే-బాదుడు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఇది ప్ర‌జ‌ల్లోకి ముఖ్యంగా మాస్ జ‌నాల్లోకి బాగానే వెళ్లింది.

ఇక‌, తాజాగా ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి కార్య‌క్రమం కూడా ప్రారంభించారు. ఇది కూడా రాబిన్ రూపొందించిన కార్య‌క్ర‌మ‌మేన‌ని స్వ‌యంగా మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్ర‌బాబు చెప్పారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లనున్నారు. త‌ద్వారా వైసీపీ ప్ర‌భుత్వంలో జ‌రిగిన న‌ష్టాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నా రు. వ‌చ్చే ఎన్నికల‌కు సంబంధించి టీడీపీ చేప‌ట్టే అత్యంత కీల‌క‌మైన కార్య‌క్ర‌మ‌మ‌ని టీడీపీ అధినేత ఇప్ప‌టికే పార్టీ నాయ‌కుల‌కు స్ప‌ష్టం చేశారు.

జగన్ రాక ముందు ఏలా ఉందో.. జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఎంత ఖర్మ పట్టిందో ఈ కార్య‌క్ర‌మం ద్వారా టీడీపీ నేత‌లు ప్ర‌జ‌ల‌కు వివరించనున్నారు. పన్నులు బాదడమేకాకుండా, ప్ర‌జ‌ల‌ను, ఆస్తుల‌ను కూడా తాకట్టు పెట్టేసి జగన్ లక్షల కోట్లు అప్పు చేసి దుబారా చేస్తున్నార‌నే విష‌యాన్ని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌నున్నారు.  వైసీపీ వ్యూహ‌క‌ర్త రిషి రాజ్‌కు కౌంట‌ర్‌గా రాబిన్ శర్మ ఈ వ్యూహాన్ని తీసుకువ‌చ్చారు.

సో.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీ గెలిచినా.. టీడీపీ గెలిచినా పీకే శిష్యులు ఇచ్చిన వ్యూహాలే కీలక కార‌ణంగా మార‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో  వారిలో ఎవ‌రు పైచేయిసాధిస్తార‌నేది ఆస‌క్తిగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News