కొత్త సంవత్సరం వేళ ఆంక్షలు.. మార్గదర్శకాలివీ

Update: 2021-12-29 17:30 GMT
ప్రపంచాన్ని ఇప్పుడు 'ఒమిక్రాన్' భయపెడుతోంది.  కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అన్ని దేశాలు లాక్ డౌన్ దిశగా సాగుతున్నాయి. మంగళవారం నాటికి భారత్ లో కొత్తగా 6358 మంది కరోనా బారినపడ్డారు. వారిలో 653 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. అంటే మొత్తం కేసులలో ఇది దాదాపు 10శాతం. ఒమిక్రాన్ సంక్రమించిన వారిలో 186మంది కోలుకున్నారు.

కరోనా కేసుల్లో మహారాష్ట్ర మొదటి నుంచి ముందున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒమిక్రాన్ విషయంలో ఆ రాష్ట్రమే టాప్ లో ఉంది. మంగళవారం నాటికి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 167కు చేరింది. ఇక దాని తర్వాత ఢిల్లీ 165 కేసులతో రెండో స్థానంలో ఉంది.  ఈ రెండు రాష్ట్రాలపై సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే.

మరోవైపు కేరళలో ఇప్పటికీ అధికసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకూ 57 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఇక తెలంగాణలో వాటి సంఖ్య 55కు చేరింది.

గుజరాత్ లో 49, రాజస్థాన్ లో 46, తమిళనాడు 34, కర్ణాటకలో 31 చొప్పున ఒమిక్రాన్ కేసులు రికార్డ్ అయ్యాయి. పెళ్లిళ్లు పండుగ సీజన్ కావడంతో దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. సడలించిన నిబంధనలను తిరిగి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయి.

దేశంలో థర్డ్ వేవ్ ను అడ్డుకోవాలంటే మొదట కేసులు పెరగకుండా చూడాలి. అలా జరగాలంటే ఆంక్షలు తప్పదు. అందుకే దేశవ్యాప్తంగా మరోసారి ఆంక్షలు కఠినతరం చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ నైట్ కర్ఫ్యూ విధిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒమిక్రాన్ కేసుల్లో తెలంగాణదేశంలో 4వ స్థానంలో ఉంది.మంగళవారం నాటికి 55 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం తాజాగా న్యూ ఇయర్ వేడుకలపై మార్గదర్శకాలు జారీ చేసింది.

ముఖ్యంగా హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మార్గదర్శకాలు జారీ చేశారు.
*బహిరంగ ప్రదేశాల్లో డీజేలకు అనుమతి లేదు.
*ధ్వని కాలుష్యంపై ఫిర్యాదు చేస్తే చర్యలు
*మద్యం సేవించి వాహనం నడిపితే 6 నెలలు జైలు శిక్ష.. రూ.10వేల జరిమానా
*అసభ్యకర దుస్తులు ధరించినా.. నృత్యాలు చేసినా చర్యలు
*మహిళలపై వేధింపుల కట్టడికి షీ బృందాలతో నిఘా
Tags:    

Similar News