గుడివాడలో కళ్లు తిరిగి పడిపోయిన చిన్న పిల్లలు

Update: 2021-03-09 16:39 GMT
ఏపీలో మరో కలకలం చెలరేగింది. కృష్ణా  జిల్లా గుడివాడలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపుతోంది. గుడివాడలోని ఆర్.సీ.ఎం మిషనరీ ప్రైమరీ స్కూల్లో దాదాపు 10 మంది విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయారు. క్లాస్ రూంలోనే కుప్పకూలడంతో టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.

విద్యార్థులంతా 1, 2వ తరగతి చదువుతున్న చిన్న పిల్లలు కావడంతో ఆందోళన నెలకొంది. కళ్లు తిరిగి పడిపోయారని.. మైకంలోనే ఉన్నారని పరీక్షించిన వైద్యులు తెలిపారు. కొంతమంది కడుపునొప్పితో విలవిలలాడారు.అయితే విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయలేదని.. లంచ్ లోపే ఈ ఘటన జరిగిందని.. ఫుడ్ పాయిజన్ జరలేదని టీచర్లు చెప్తున్నారు. డాక్టర్లు విద్యార్థుల అస్వస్థతకు కారణం చెప్పలేకపోతున్నారు.

విషయం తెలియగానే.. గుడివాడ ఎమ్మెల్యే కం మంత్రి కొడాలి నాని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. జరిగిన ఘటనపై సమీక్షించారు. 'పిల్లలకు మెరుగైన వైద్యం అందిస్తామని.. పిల్లలకు మత్తు లక్షణాలు తప్ప మిగతా అంతా బావుందని' కొడాలి నాని తెలిపారు. బయట నుంచి తెచ్చిన ఆహారం ఏమైనా తిన్నారా? అనే దానిపై విద్యార్థులు మెళకువలోకి వచ్చాక తెలుసుకుంటామన్నారు.ఇక విద్యార్థులు తాగిన నీరు, బిస్కెట్లు, చాక్లెట్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపారు.
Tags:    

Similar News