అసలే ఫైర్ బ్రాండ్. దానికి తోడు కాంగ్రెస్ నేతలు.. అందునా గాంధీ ఫ్యామిలీ అంటే చాలు.. విరుచుకుపడతారు. విమర్శలతో చెలరేగిపోతారు. ఎక్కడెక్కడి సమాచారాన్ని వెలికి తీసి మరీ ఉతికి ఆరేస్తుంటారు. ఇంతకీ ఆయన ఎవరంటారా? తాను టార్గెట్ చేయాలని ఒక్కసారి డిసైడ్ కావాలే కానీ.. సొంత పార్టీ.. పరాయి పార్టీ అన్న తేడా లేకుండా తన మాటలతో ఉక్కిరిబిక్కిరి చేయగల సామర్థ్యం బీజేపీ నేత.. రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి సొంతం.
ఏ విషయం మీదనైనా.. ఏ పార్టీ నేత మీదనైనా ఎవరూ అంచనా వేయలేని సమాచారాన్ని బయట పెట్టగల సామర్థ్యం సుబ్రమణ్యస్వామి సొంతం. ఆయనకు అందరి కంటే గాంధీ కుటుంబం మీద ఎక్కువగా గురి పెడుతుంటారు. ఆయన టార్గెట్ చేస్తే.. ప్రత్యర్థికి చెమటలు పట్టాల్సిందే. ఇక.. అవినీతి వ్యవహారాల మీద ఆయన బయటపెట్టే సమాచారం ప్రత్యర్థులు ఆత్మరక్షణలో పడేలా చేయటమే కాదు.. వారి కెరీర్ లో ఒక మచ్చగా మారుతుంది.
ఇలా తానేం చేసినా సంచలనాలు సృష్టించే స్వామి తాజాగా ప్రియాంక మీద గురి పెట్టారు. త్వరలో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న ఆమెపైన మరకలాంటి ఆరోపణను బయటపెట్టారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతల్ని చేపట్టనున్న ఆమె పె..ద్ద తప్పు చేసిందన్నది ఆయన తాజా ఆరోపణ. ఇంతకీ ఆమె చేసిన తప్పు ఏమిటంటే.. కంపెనీల చట్టం ప్రకారం ఒకటి మాత్రమే ఉండాల్సిన డైరెక్టర్ గుర్తింపు నెంబర్ మూడు ఉన్నాయని.. అది కచ్ఛితంగా నేరం కిందనే వస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు.
ఏదో నోటికి వచ్చినట్లుగా మాట్లాడేస్తున్నారన్న మాట అంటారేమోనన్న అనుమానమో మరొకటో కానీ.. తాను చేసిన ఆరోపణకు లెక్క ఉందన్నట్లుగా ప్రియాంకకు ఉన్న మూడు డిన్ నెంబర్లను కూడా ఆయన బయటపెట్టారు. కంపెనీల చట్టం 1956 ప్రకారం ఒక వ్యక్తికి డిన్ నెంబరు ఒక్కటే ఉండాలి. ఇక.. చట్టంలోని సెక్షన్ 266 సీ.. 621 ఏ ప్రకారం ఆమె మూడు డిన్ నెంబర్లను కలిగి ఉండటం నేరం. ఆమె చేసిన తప్పునకు ఆర్నెల్లు జైలుశిక్ష.. రూ.50వేల వరకూ జరిమానాను విధించాల్సి ఉంటుందన్నారు.
ఆమెకున్న డిన్ నెంబర్లు అంటూ.. (01038703 - 01840144 - 02914391 ) మూడు నెంబర్లను స్వామి బయటపెట్టారు. తానీ విషయాన్ని ఇప్పుడు చెప్పటం లేదని.. 2014లోనే ఫిర్యాదు చేసినట్లు ఆయన గుర్తు చేసే ప్రయత్నం చేశారు. తెలియక చేసిన పొరపాటుగా ప్రియాంక అప్పట్లో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి సంజాయిషీ ఇచ్చుకున్నారని చెప్పారు. ఫైన్ చెల్లించేందుకు కూడా సిద్ధమయ్యారన్నారు. కానీ.. ఇది చాలా పెద్ద నేరమని.. ఏ పౌరుడు ఒకటికి మించిన డిన్ నెంబర్లను కలిగి ఉండకూడదన్నారు. అయినా.. ప్రియాంక ఏమైనా చిన్నపిల్లా? అందులోకి వారికుండే సర్కిల్ చిన్నదా? ఆమె చేసే ప్రతి పనిని.. ఆమెకు సంబంధించిన బోలెడంత మంది పరివారం అనుక్షణం చెక్ చేసిన తర్వాతే చేస్తారు కదా? అలాంటప్పుడు డిన్ విషయంలో ప్రియాంక తప్పు ఎందుకు చేసినట్లు?