బీజేపీ నేత‌... ఎంత తియ్య‌టి మాట !

Update: 2018-05-11 16:16 GMT
రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌జ‌ల గురించి వంద మాట్లాడ‌తారు. ఒక్కోసారి వాళ్ల మాట‌లు వింటే ఆహా ఊహ‌లకు కూడా దూరంగా ఉంటుంది. కానీ చేత‌ల్లో నెర‌వేరి సామాన్యుడు సంతృప్తి ప‌డిన సంద‌ర్భాలు చాలా అరుద‌నే చెప్పాలి. అయితే, సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లోకి వ‌చ్చే బీజేపీ నేత‌ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి తాజాగా జ‌నం చెవులకు స‌మ్మ‌గా ఉండే ఒక డిమాండ్ చేశాడు.

దేశ ఆర్థిక వృద్ధికి పొదుపు చాలా అవ‌స‌రం అని కాబ‌ట్టి ఆదాయ‌పు పన్ను తొల‌గిస్తే పొదుపు భారీగా పెరుగుతుంద‌ని, పెట్టుబ‌డులు వ‌ర‌దలా వ‌స్తాయ‌ని అన్నారు. ఈ డిమాండ్ నెర‌వేరుతుంద‌న్న‌ది దాదాపు అసాధ్య‌మైన క‌లే గాని... విన‌డానికి మాత్రం జ‌నానికి చాలా హాయిగా ఉంది.  హైదరాబాద్ హైటెక్స్ లో ఇండియన్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఫ్యూచర్ అఫ్ ఇండియా ఇన్ ఎమర్జింగ్ వరల్డ్ సదస్సుకు ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాల‌పై విశ్లేషించిన ఆయ‌న ప‌న్ను తొల‌గింపు వ‌ల్ల క‌లిగే లాభాల‌ను వివ‌రించారు.  

దేశానికి ఇప్ప‌టికీ నిరుద్యోగం - పేదరికం పెద్ద స‌మ‌స్య‌లుగా ఉన్నాయ‌ని చెప్పిన ఆయ‌న వాటి పరిష్కారానికి చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంద‌న్నారు. భార‌త వృద్ధిరేటు వ‌చ్చే ద‌శాబ్దంలో మ‌రో ప‌ది శాతం పెరిగితే త‌ప్ప ఇది సాధ్యం కాద‌న్నారు. అయితే ప‌న్నుల భారం ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు - స్టార్టప్ కంపెనీలపై ఉంటోంద‌ని వివరించిన సుబ్ర‌మ‌ణ్య‌స్వామి దేశంలో చాలా తక్కువమంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారు. ప‌న్ను ప్ర‌భుత్వ హ‌క్కు అనుకుంటున్నారు కానీ అది కూడా ఒక వేధింపు అని ఆయ‌న వివ‌రించారు. మధ్య తరగతి ప్ర‌జ‌ల ఆలోచ‌న విధానంలో విప్ల‌వం రావాలంటే - వారి సేవ‌లు పూర్తిగా దేశానికి ఉప‌యోగ‌ప‌డాలంటే వ్యక్తిగత ఆదాయపన్నును రద్దు చేయాలని సూచించారు. దీనివ‌ల్ల డ‌బ్బు దాచ‌డం మానేసి - పెట్టుబ‌డులు పెట్ట‌డం అల‌వాటు చేసుకుంటార‌న్నారు. ప‌రోక్షంగా ప్రజల్లో ఆదాయం - పొదుపు సామర్ధ్యం పెరుగుతుందని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి చెప్పారు.

సుబ్ర‌మ‌ణ్య‌స్వామి వార్త‌ల‌కు ప‌నికొచ్చే మాట్లాడ‌తారు గాని జ‌నానికి ప‌నికొచ్చే మాట‌లు మాట్లాడ‌రు అని అనుకునే వారి అభిప్రాయాన్ని ఈరోజు తుడిచేశారు.
Tags:    

Similar News