ఆ పాపాన్ని ‘‘ఆర్ 3’’ ఖాతాలో వేసిన స్వామి

Update: 2016-08-20 10:27 GMT
బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రమణ్య స్వామి గడిచిన కొద్దికాలంగా మౌనంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ మధ్యన ఆర్ బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఆయన.. మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచారు. అనంతరం మరికొన్ని అంశాల మీద ఆయన గళం విప్పినా ఆవేమీ పెద్దగా ఫోకస్ కాలేదు. మోడీ మీద పొడగ్తలు.. ఆ తర్వాత తెగడ్తతో మీడియాలో దర్శనమిచ్చిన ఆయన.. ఉన్నట్లుండి కామ్ అయిపోయారు. ఏ విషయం మీదా స్పందించకుండా ఉండిపోయిన ఆయన తాజాగా మరోసారి గళం విప్పారు.

రెండు మూడు రోజుల క్రితమే.. తనకు మొయిన్ స్ట్రీమ్ మీడియా అవసరం లేదని.. తనకు సోషల్ మీడియా సరిపోతుందంటూ చెప్పిన ఆయన.. తాజాగా దేశంలో నెలకొన్ని ద్రవ్యోల్బణం విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో తలెత్తిన రుణాత్మక ద్రవ్యోల్బణ పరిస్థితులకు ‘‘ఆర్ 3’’ కారణం అంటూ పాలకుల పాపాన్ని ఆర్ బీఐ ఖాతాలోకి మళ్లించే ప్రయత్నం చేశారు. స్వామి ప్రస్తావించిన ‘ఆర్ 3’ గురించి మొదట చెప్పాలి. ఆర్ బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ను షార్ట్ కట్ లో ‘ఆర్ 3’గా స్వామి సంబోధిస్తుంటారు. ఆయన పేరులోని మూడు ‘ఆర్’లను తీసుకొని పొట్టిపేరుతో పిలుస్తుంటారు.

మరికొద్ది రోజుల్లో ఆర్ బీఐ గవర్నర్ గా పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో ఆయన పదవీ కాలంలో తీసుకున్న నిర్ణయాల్ని తప్పు పట్టేలా తాజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్ బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన రఘురాం రాజన్ మరికొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. రాజన్ పదవీ కాలం విజయవంతమైందన్న మాటను పలువురు చెబుతున్న వేళ.. అందుకు భిన్నంగా ఆయన కారణంగానే ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని విమర్శించటం గమనార్హం. తన వాదనకు తగ్గట్లే ఐఎంఎఫ్ వర్కింగ్ పేపర్ ను కోట్ చేశారు. రాజన్ అనుసరించిన వడ్డీ రేట్ల విధానమే తాజా ద్రవ్యోల్బణానికి కారణంగా స్వామి చెబుతున్నారు. స్వామి మాటలు చూస్తుంటే.. రాజన్ టర్మ్ ను ఫెయిల్యూర్ అన్న ఇమేజ్ కలిగేలా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.​
Tags:    

Similar News