నీతులు చెప్పే చంద్రబాబు చేతల్లో తన వైఖరిని చెప్పేస్తుంటారు. అయితే.. ఆయనకున్న మీడియా దన్ను పుణ్యమా అని ఆయనపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం కానీ.. విమర్శలు చేయటం.. లోపాల్ని ఎత్తి చూపటం లాంటివి అస్సలు కనిపించవు. దీంతో.. అనుకూల మీడియాతో.. అనుకూల వార్తల్ని పొంగి పొర్లేలా చేస్తుంటారు. దీంతో.. బాబు చేసే తప్పులు కనిపించని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. బాబు తప్పుల్ని తాజాగా ఎత్తి చూపించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు. బాబు చేసిన దుర్మార్గాన్ని ఆయన ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. సొంత మామ.. పార్టీ ఆవిర్భావ అధ్యక్షుడైన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిని బాబు దుర్మార్గం కారణంగా ఎన్టీఆర్ అభిమానులు నేటికీ ఏడుస్తున్నారన్నారు.
బాబును దొంగ అంటూ ఎన్టీఆర్ నేరుగా అన్న మాటకుసంబంధించిన వీడియో ఉందన్న సుధాకర్ బాబు.. నందమూరి రాజకీయ వారసులు హరికృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వారి వంశం నుంచి రాజకీయ వారసులు ఎందుకు రావటం లేదంటూ నిలదీశారు. రాజకీయ విలువలు ఉంటే చంద్రబాబు తానిచ్చిన హామీల్ని అమలు చేసి చూపించాలన్నారు.
బాబు కుమారుడు లోకేశ్ టీడీపీకి వారసుడా అన్న ఆయన.. దమ్ముంటే.. నారా వారి పార్టీ అని పెట్టి రెండంటే రెండు సీట్లు గెలిస్తే చాలన్నారు. తనకున్న అనుకూల మీడియాతో చంద్రబాబు తిమ్మిని బమ్మిని చేస్తున్నారన్నారు. ఏపీకి బాబు సీఎంగా ఉండటం రాష్ట్రం చేసకన్న దౌర్భాగ్యమన్నారు. ఆగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు ఎప్పుడు తీరుస్తారని ప్రశ్నించిన ఆయన.. చంద్రబాబు రాష్ట్రానికి చేసిన కుట్రలు ప్రజలకు అర్థమవుతున్నాయన్నారు.
టీడీపీ నేతలు సుజనా చౌదరి.. దీపక్ రెడ్డి లాంటి వాళ్లు ఆర్థిక నేరస్తులు కాదా? అని ప్రశ్నించిన ఆయన.. పదేళ్లుగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంటే.. ఏడాదికే ఎందుకు పారిపోయి వచ్చారని క్వశ్చన్ చేశారు. చంద్రబాబుకు నిజంగా రాజకీయ విలువలు ఉంటే.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాలు విసిరారు. బాబు లాంటి వారు.. ఇలాంటి సవాళ్లకు రియాక్ట్ అవుతారా ఏంటి?