ప్రగతిభవన్ వద్ద అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం.. హరీశ్ కాన్వాయ్ కు అడ్డంగా పడ్డారు
షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార నివాసమైన ప్రగతి భవన్ వద్ద అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఆత్మహత్యాయత్నం చేసుకునే ప్రయత్నం చేయటం షాకింగ్ గా మారింది. ఒకరు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని హల్ చల్ చేస్తే.. అదే సమయంలో అక్కడకు వచ్చిన మంత్రి హరీశ్ కాన్వాయ్ కు అడ్డం పడి.. మరొకరు సూసైడ్ అటెంప్టు చేశారు.
దీంతో.. ఒక్కసారి గందరగోళం చోటు చేసుకుంది. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అక్కడే ఉన్న పోలీసులు.. భద్రతా సిబ్బంది తేరుకొని.. వారిద్దరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకునే ప్రయత్నం చేసిన అతనిపై నీళ్లు పోశారు.ఇంత హడావుడి వారెందుకు చేసినట్లు? అన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు సోదరుల వెర్షన్ ప్రకారం.. ఒక బిల్డర్ తో కుమ్మక్కైన పేట్ బషీరాబాద్ సీఐ తమను వేధింపులకు గురి చేస్తున్నాడని వారు ఆరోపించారు. దీంతో.. తట్టుకోలేకనే తాము సూసైడ్ అటెంప్టు చేసినట్లుగా వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సోదరులపై గతంలోనూ కేసులు నమోదై ఉన్నాయని.. వారికి జైలుశిక్ష కూడా పడినట్లుగా తెలుస్తుంది. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బేగంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.