ప్యారిస్ ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాదుల మీద ఈ అగ్రరాజ్యం కన్నెర్ర చేసింది. ఉగ్రమూలాల్ని తుడిచి పెట్టేయాలని భావిస్తున్న ఫ్రాన్స్ దేశ వ్యాప్తంగా జల్లెడ పడుతోంది. ఇందులో భాగంగా రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా భద్రతా దళాలు గాలింపులు చేపడుతున్నారు. ప్యారిస్ దాడి సూత్రధారిగా భావిస్తున్న అబ్దెల్ హమీద్ అబోద్ ను ఎలాగైనా పట్టుకోవాలని భావిస్తున్న ఫ్రాన్స్ భద్రతా బలగాలు.. అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అనుమానితులుగా కనిపిస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య సాగిన కాల్పుల పోరులో.. కనీసం ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు చెబుతున్నారు. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. భద్రతా బలగాలకు.. అనుమానితుల మధ్య కాల్పులు మొదలు కావటం.. అవి తీవ్రంగా మారాయి. అనుమానితుల కాల్పుల్లో భద్రతా దళాలకు చెందిన వారు పెద్ద ఎత్తున గాయపడినట్లుగా సమాచారం. అయితే.. ఈ పోలీస్ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలు మరిన్ని అందాల్సి ఉంది.
దేశంలో ఉగ్రవాదుల జాడ భారీగా ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. ఉగ్రవాదులు.. వారికి సాయంగా నిలిచేవారు.. వారికి నైతిక మద్దతు ఇచ్చే వారి కోసం గాలింపులు మరింత తీవ్రతరం చేశారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
తాజాగా కాల్పుల కలకలం రేగిన సెయింట్ డెనిన్ నగరాన్ని పోలీసులు తమ అధీనంలో తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సెయింట్ డెనిన్ నగరానికి వెళ్లే దారులన్నింటిని మూసివేసిన భద్రతా బలగాలు.. ప్రజలను ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో భారీగా వాహనాల్ని సిద్ధం చేశారు. పెద్ద ఎత్తున బలగాల్ని మొహరించారు. ప్రస్తుతం సెయింట్ డెనిస్ నగరంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది.