తాజాగా ఇదే సమస్యతో ఏకంగా ఆత్మహత్యకే ప్రయత్నించిన ఎయిమ్స్ డాక్టర్ ప్రియా వేది సంగతి తెలిసిందే! తన భర్త ఒక గే అని తెలుసుకుని ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది! తన ఆత్మహత్యకు ముందు ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. చేతకాని మొగుడు చీమ చిటుక్కుమన్నా... సందేహిస్తాడన్నట్లు... పెళ్లయిన ఐదేళ్లలో ఆమెకు ఎటువంటి శారీరక సుఖం దక్కలేదు సరికదా... పెట్టిన టార్చర్ అంతా ఇంతా కాదు! ఈ విషయలన్నీ మనసు చంపుకుని ప్రపంచానికి తెలియజేసింది ప్రియావేది! ఆ సూసైడ్ నోట్ చదివిన వారికెవరికైనా... ఆమె పడిన బాద, అనుభవించిన వేదన ఇట్టే అర్థం అవుతుంది.
భర్త తాగుబోతు అయితే... ఎప్పటికైనా మానేస్తాడులే అనుకోవచ్చు, సిగరెట్ తాగుతుంటే... మానిపించేయగలనులే అని దైర్హ్యం చెప్పుకోవచ్చు. చెడు తిరుగుల్లు తిరుగుతుంటే... ఇంట్లో పెద్దోళ్లతో చెప్పించొచ్చు. కానీ... అసలు మగాడే కాకపోతే... "మహిళ వద్దు మగాడే ముద్దు" అని శోభనం గదిలో భర్త, తన భార్య తో అంటే? ప్రస్తుతం ఈ విషయాలే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి! సోషల్ మీడియా వేదికగా ఇదే టాపిక్పై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఒక గే వాస్తవాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకుంటే జీవితంలో జరిగే తదనంతర పరిణామాలపైనే ప్రస్తుత యువత ఆలోచిస్తుంది.
గే కూడా మనిషే, అతడికి మనసుంటుంది, అందులో ఇంకేదో ఉంటుంది. వంటి విషయాలు కాసేపు పక్కనపెడితే... ఎన్నో ఆశలతో పెళ్లికి సిద్ధ పడిన ఒక మహిళ జీవితంతో ఆటాడుకునే అర్హత అతడికి లేదు, రాదు, ఉండబోదు! ఇదే సమయంలో ఈ మానసిక స్థితిపై..." గే పెళ్లి చేసుకుని హ్యాపీగా, హాయిగా భార్యాపిల్లలతో ఏ ఇబ్బందీ లేకుండా జీవితాన్ని గడిపేస్తే పర్వాలేదు... కానీ ఇలా ఇంకో యువతి జీవితంతో ఆడుకుంటేనే అసలు సమస్య ఎదురవుతుందని" సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇలా జీవితాన్ని జైలు పాలుచేసుకోవడంకన్నా సమాజంలోని కట్టుబాట్లని పక్కకుపెట్టి, పెళ్లి చేసుకోకుండా వుండటమే మేలు అనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు! ఇది మహిళ తనంతట తానుగా పెళ్లికి ముందే తెలుసుకునే విషయం కాదు... కాబట్టి ఈ విషయంలో మగాడే కాస్త పెద్ద మన్సుచేసుకుని ఆలోచించాలని... తమ బలహీనతలవల్ల వారు ఇబ్బంది పడితే పర్లేదు కానీ... ఇతరుల జీవితాలను ఇబ్బంది పెట్టడం అతిపెద్ద క్రం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.