నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సి ఆర్ బి ) దేశంలో జరిగిన మరణాలు, ఆత్మహత్యలకు సంబంధించి తాజా నివేదికను బహిర్గతం చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం .. రోడ్డు ప్రమాదాలు, సంబంధిత మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ ఆత్మహత్యలలో మాత్రం పెరుగుదల విపరీతంగా ఉందని వెల్లడించింది. ఇది 2020 జనవరి నుంచి డిసెంబర్ వరకు కాల వ్యవధిని తెలియజేస్తుంది. ఈ పీరియడ్ లో ఆత్మహత్యల మరణాల సంఖ్య వేగంగా పెరిగిందని తెలుస్తోంది.
మొత్తంమీద ఆత్మహత్యల నుంచి153,052 మరణాలు సంభవించాయి. 1967 నుంచి ఇదే అత్యధికం. ఈ సంఖ్య 2019 నుంచి పోల్చుకుంటే 10% పెరిగింది. 1967 నుంచి తీసుకుంటే నాలుగో అత్యధిక సంఖ్య. ఖచ్చితంగా ఇది దేశానికి మంచిది కాదు. 2020లో ప్రతి లక్ష జనాభాకు ఆత్మహత్యల మరణాల సంఖ్య 11.3గా ఉంది. ఇది గత 10 ఏళ్లలో అత్యధిక రేటు కాగా 2010లో మాత్రం 11.4గా నమోదైంది. ఇక ఇదే సమయంలో ఆత్మహత్య లు భారీగా పెరిగాయి. దీనికి లాక్ డౌన్ , వర్క్ ఫ్రమ్ హోమ్ కారణమా అని అంటే .. విద్యార్థులు, నిపుణుల గణాంకాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది.
మార్చిలో ప్రారంభమైన 68 రోజుల కఠినమైన లాక్ డౌన్ తర్వాత పాఠశాలలు, కళాశాలలు తెరవకపోవడంతో చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. దీనివల్ల ఆత్మహత్యలు పెరిగాయి. భారతదేశంలో 29 మిలియన్ల మంది విద్యార్థులకు డిజిటల్ పరికరాలు విక్రయించే సామర్థం లేదు. ఈ కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే పేదరికం వల్ల 69%, నిరుద్యోగం వల్ల 24% ఆత్మహత్యలు నమోదయ్యాయి. తర్వాత మాదకద్రవ్యాల దుర్వినియోగం లేదా మద్యపాన వ్యసనం 17%, అనారోగ్యం16%, కుటుంబ సమస్యలు14% వల్ల ఆత్మహత్యలు జరిగాయి.