తెలుగు తమ్ముడి కోపం ఏపీ అధికారపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దళితులకు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందన్న వాదనను తెర మీదకు తీసుకొచ్చి.. అధినేత పాలనపై విరుచుకుపడిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సీఎం సొంత జిల్లాకు చెందిన ఎంపీనే ఇంతలా విరుచుకుపడటం.. బాబు తీరును తప్ప పట్టటం చర్చనీయాంశంగా మారింది. దీంతో.. ఆయన్ను కంట్రోల్ చేసేందుకు బాబు తన మార్క్ అయిన బుజ్జగింపుల స్థానే.. బెదిరింపులకు దిగటం పలువురిని ఆశ్చర్యపరిచింది. అందరిని బుజ్జగించే అధినేత.. తన దగ్గరకు వచ్చేసరికి ఏకంగా సీరియస్ కావటం.. సస్పెండ్ చేస్తానన్న వార్నింగులు ఎంపీని తీవ్ర వేదనకు గురి చేశాయి. అందరి ఎదుట తనను చిన్నబుచ్చిన వైనంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
అప్పటివరకూ తన అసంతృప్తిని మాత్రమే బయటకు వెళ్లగక్కిన ఆయన.. బాబు తీరుతో మరింత చెలరేగిపోయారు. తాను సీరియస్ అయితే.. ఇష్యూ ఒక కొలిక్కి వస్తుందనుకున్న స్థానే.. అందుకు భిన్నంగా పరిస్థితులు చోటు చేసుకోవటంతో.. బాబు తనకు సన్నిహితుడైన కేంద్రమంత్రి సుజనాను సీన్లోకి తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. ఆయనతో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి అమర్ నాథ్ రెడ్డిని కూడా బుజ్జగింపుల కోసం వినియోగించినట్లుగా తెలుస్తోంది.
అయితే.. వీరిద్దరి మాటలకు ఎంపీ శివప్రసాద్ కన్వీన్స్ కాలేదని చెబుతున్నారు. శనివారం రాత్రి పలుమార్లు వీరు ఫోన్లో మాట్లాడటం ద్వారా.. శివప్రసాద్ ఇష్యూను క్లోజ్ చేద్దామని ప్రయత్నించినా.. తనకు జరిగిన అన్యాయాన్ని ఏకరవు పెట్టిన వైనంతో సుజనా.. అమర్ నాథ్ లు ఏమీ మాట్లాడలేకపోయినట్లుగా చెబుతున్నారు. తాను దళితుడ్ని కాబట్టే.. వీడియో కాన్పరెన్స్ పెట్టి మరీ సస్పెండ్ చేస్తానని.. కబ్జా మరకలు అంటిస్తారా? అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎంపీ శివప్రసాద్ కు మద్దుతుగా పలు దళిత సంఘాలు గళం విప్పటంతో.. పరిస్థితి అంతకంతకూ క్లిష్టంగా మారుతుందన్న విషయాన్ని టీడీపీ అధినాయకత్వం గుర్తించినట్లు చెబుతున్నారు.
నిజం మాట్లాడిన తనను సస్పెండ్ చేస్తానని బెదిరిస్తారా? ఎలా చేస్తారో నేనూ చూస్తానంటూ ఫైర్ అయిన శివప్రసాద్ ను శాంతింపచేసేందుక ఫోన్లో రాయబారాలు కుదరవన్న విషయాన్ని తెలుసుకున్న సుజనా.. అమర్ నాథ్ లు.. స్వయంగా శివప్రసాద్ వద్దకు వెళ్లాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఫోన్లో ఎంత మాట్లాడినా.. శివప్రసాద్ తగ్గకపోవటంతో.. నేరుగా మాట్లాడటం ద్వారా.. ఆయన్ను శాంతింపచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాము కలిసి మాట్లాడేంత వరకూ కనీసం మీడియాతో అయినా మాట్లాడకుండా ఉండాలని రిక్వెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆగ్రహంతో ఊగిపోతున్న తమ్ముడ్ని సెట్ చేసేందుకు సుజనా.. అమర్ నాథ్ లు తిరుపతికి వెళ్లనున్నట్లుగా చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/