పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు కేంద్రమంత్రి సుజనా చౌదరి.. ఎంపీ అవంతి శ్రీనివాసరావు. గురువారం విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి నగరానికి వస్తున్న వారు భారీ ప్రమాదం నుంచి సేఫ్ గా బయటపడ్డారు. వేగంగా వెళుతున్న వాహనాల సముదాయంలోకి ఆకస్మాత్తుగా రెండు వాహనాలు ఎంటర్ కావటం.. వాటిని తప్పించుకునే క్రమంలో సడన్ బ్రేక్ లు వేసిన సందర్భంగా వాహనాలు ఒకటికొకటి బలంగా గుద్దుకున్నాయి.
అయితే.. వాహనంలో ఉన్న మంత్రి సుజనా చౌదరి సీటు బెల్ట్ ధరించటంతో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి నేషనల్ హైవే నుంచి వస్తున్న సుజనా కాన్వాయ్ లోకి రెండు కార్లు అనుకోకుండా వచ్చేశాయి. వాటిని తప్పించేందుకు సుజనా ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దీంతో.. కాన్వాయ్ లో వెనకనున్న వాహనాలు బలంగా సుజనా ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీ కొట్టాయి.
ప్రమాదానికి గురైన కారులో కేంద్ర మంత్రి సుజనాతో పాటు.. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు ఉండటం.. ఇరువురూ క్షేమంగా బయటపడటంతో పోలీసులు.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి కాన్వాయ్‌లోకి వచ్చిన రెండు కార్లకు సంబంధించిన వివరాల్ని సేకరిస్తున్న అధికారులు.. ఈ ఉదంతంపై విచారిస్తున్నారు. సీటు బెల్ట్ పెట్టుకొని ఉండకపోతే తప్పనిసరిగా పెను ప్రమాదం వాటిల్లి ఉండేదని చెబుతున్నారు. చాలామంది ప్రముఖల మాదిరి కాకుండా.. వాహనంలో సీటు బెల్ట్ పెట్టుకోవటం సుజనాను సేఫ్ చేసిందని చెప్పక తప్పదు.