సుజ‌నా స్పీడ్ పెంచారే.. రీజ‌న్ ఇదేనా?

Update: 2021-12-24 02:30 GMT
టీడీపీ మాజీ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రి స్పీడ్ పెంచారు. వాస్త‌వానికి ఆయ‌న‌కు నేరు గా ప్ర‌జ‌ల‌తో సంబంధం లేదు. ఆయ‌న రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. అంతే త‌ప్ప‌.. ప్ర‌జ‌ల నుంచి ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కింది లేదు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న తాజాగా దూకుడు పెంచ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనికి రీజ‌నేంటి? ఎందుకు ఆయ‌న దూకుడు పెంచారు? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. రాష్ట్రంలో బీజేపీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాజ్య‌స‌భ స‌భ్యులు.. మంద‌కొడిగా ఉన్నార‌ని.. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా హాజ‌రు కావ‌డం లేద‌ని.. రాష్ట్ర నేత‌లు కొన్నాళ్లుగా కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారు.

దీంతో ఏపీ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బీజేపీ ఎంపీలకు ఇటీవ‌ల కేంద్ర మంత్రి అమిత్ షా.. దిశానిర్దే శం చేసిన‌ట్టు తెలిసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌ని.. కేంద్రం చేస్తున్న ప‌నుల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే బాధ్య‌త రాష్ట్ర నాయ‌కులు చూసుకుంటార‌ని. కానీ, ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండే బాధ్య‌త‌,.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకునే బాధ్య‌త మీరుతీసుకోవాల‌ని..ఆ య‌న రాజ్య‌స‌భ స‌భ్యుల‌కు సూచించార‌ట‌. పార్టీ అధికారంలోకి రావ‌డ‌మే ప్ర‌స్తుత ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఎంపీలు టీజీ వెంక‌టేశ్‌, సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్‌లు ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ముఖ్యంగా సుజ‌నా చౌద‌రి.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎప్పుడూ.. ప్ర‌జ‌ల్లోకి రాని ఆయ‌న‌.. ఇప్పు డు ప్ర‌జ‌ల కోసం.. తాను ఉన్నానంటూ.. ప్ర‌త్యేకంగా ఒక ఫోన్ నెంబ‌రును క్రియేట్ ఇచ్చారు. అదేస‌మ‌యం లో సేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పేరిట‌.. ఒక ఈ మెయిల్‌ను కూడా ఇచ్చారు. ప్ర‌జ‌లు ఎవ‌రైనా.. త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని భావిస్తే.. త‌క్ష‌ణ‌మే.. స్పందించి.. పోలీసుల‌కు కంప్ల‌యింట్ చేయాల‌ని.. ఆ కాపీని త‌మ‌కు పంపాల‌ని.. న్యాయం చేసేలా చూస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. అయితే.. ఇలా హామీ ఇవ్వ‌డం వెనుక కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా ఉన్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఆయ‌న ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇలా ప్ర‌జ‌ల‌లోకి వ‌స్తున్నార‌ని అంటున్నారు. ఏదేమైనా.. సుజ‌నా జ‌నం బాట‌ప‌ట్ట‌డం.. మంచిదేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News