వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదేమో కానీ.. ఉమ్మడి రాష్ట్రంలోని అసెంబ్లీలో.. అందరి ముందు వైఎస్ సతీమణి విజయమ్మను తూలనాడటమే కాదు.. జగన్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన బత్స సత్యనారాయణను జగన్ తన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి.. ఆత్మీయ హగ్ ఇచ్చినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు.
కన్నతండ్రిని అన్ని మాటలు అన్న వ్యక్తిని సైతం.. రాజకీయ అవసరాల కోసం జగన్ క్షమిస్తారా? అని సందేహం వచ్చిన వారెందరో ఉన్నారు. బత్స సత్యనారాయణ రాకతో మాంచి ఉత్సాహం మీదున్న జగన్‌కు.. అదెంత కాలమో ఉండేటట్లు కనిపించటం లేదు. బత్స వచ్చిన దాని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువన్నట్లుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
విజయనగరం రాజకీయాల్లో బత్స ఫ్యామిలీ అంటే ఏ మాత్రం పొసగని విజయనగరం ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు పార్టీ మారే అంశంపై తీవ్రంగా ఆలోచిస్తున్నారు. మాజీగా ఉన్న బత్సను చేర్చుకున్నందుకు.. ఎమ్మెల్యేగా ఉన్న సుజయ్‌కృష్ణ గుడ్‌బై చెప్పేందుకు రెఢీ అవుతున్నారు. తాజాగా ఆయన.. కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి.. భవిష్యత్తు రాజకీయ నిర్ణయం కోసం అందరిని సలహా కోరుతున్నారు. దీంతో.. అలెర్ట్ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు.. సుజయ్‌కృష్ణను బుజ్జగించేందుకు కిందా మీదా పడుతున్నారు. మరి.. ఈ ప్రయత్నాలకు సుజయ్‌కృష్ణ ఎంతవరకు తలగ్గుతారో చూడాలి. ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయని ఊహించకుండానే సమావేశం పెట్టేస్తారా ఏంటి..?