లోక్‌ సభ ఎన్నికల్లో సుమలత

Update: 2019-02-21 07:47 GMT
కర్నాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సినీ నటి సుమలత రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే.. ఇవాళ మాజీ సీఎం సిద్ధరామయ్యకు కలిశారు. మాండ్యా నియోజకవర్గ ప్రజలు, అంబరీష్‌ అభిమానులు తనని పోటీ చేయాల్సిందినా ఒత్తి చేస్తున్నారని.. వారి కోరిక మేరకే రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సిద్ధరామయ్యకు చెప్పారు సుమలత. అయితే.. జేడీఎస్‌ పొత్తు ఉండడం వల్ల.. మాండ్యా సీటు ఎవరికి వస్తుందో తెలియదని.. ఒకసారి అధిష్టానంతో మాట్లాడి చెప్తానని అన్నారు సిద్ధరామయ్య.

కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ, సినీ హీరో అంబరీష్‌ అకాల మరణంలో మాండ్యా లోక్‌ సభ స్థానం ఖాళీ అయ్యింది. అయితే లోక్‌ సభ ఎన్నికలు ఎక్కువ దూరంలో లేకపోవడంతో.. సార్వత్రిక ఎన్నికలతో పాటే మాండ్యా సీటుకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ ఈ సీటు పై కన్నేశారు కర్నాటక సీఎం సిద్ధరామయ్య. తన కొడుకు నిఖిల్‌ కుమారస్వామికి రాజకీయ భవిష్యత్‌ కల్పించేందుకు మాండ్యా నుంచి ఎంపీగా పోటీ చేయించాలని ప్లాన్ చేశారు. దీనిద్వారా కాంగ్రెస్‌ కు కూడా చెక్ పెట్టొచ్చనేది కుమారస్వామి ప్లాన్‌.

ఇప్పుడు మాండ్యా సీటు కోసం సుమలత రంగంలోకి దిగడంతో రాజకీయాలు రంజుగా మారాయి. కుమారస్వామి పై పగతో రగిలిపోతున్న సిద్ధరామయ్యకు ఇదొక మంచి అవకాశం. సుమలతకు టిక్కెట్ ఇప్పిస్తే.. నియోజకవర్గంలో సెంటిమెంట్‌ కూడా బాగా వర్కవుట్‌ అవుతుంది. అలాగే జేడీఎస్‌ ప్రయత్నాలకు కూడా చెక్ పెట్టినట్లు అవుతుంది. అందుకే.. అధిష్టానంతో కొట్లాడైనా సరే.. సుమలతకు ఎంపీ సీటు ఇప్పించాలని ఉవ్విళ్లూరుతున్నారు సిద్ధరామయ్య.


Tags:    

Similar News