కన్నడ నాట అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సిత్రాలు చూడాలో అన్నింటినీ చూశాం. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి చాలా కాలమే అయినా కర్ణాటకలో రాజకీయం రంజుగా సాగుతోంది. అధికారం దాహంతో ముందుకు సాగిన అక్కడి పార్టీలు ఒకరిపై మరొకరు పైచేయి సాధించే క్రమంలో ఇప్పటికీ అక్కడ సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అక్కడ మొదలైన కసరత్తులు నాన్ స్టాప్ యాంగ్జైటీని కొనసాగిస్తున్నాయి. పొత్తుల పార్టీలుగా కొనసాగుతున్న జేడీఎస్ - కాంగ్రెస్ లతో పాటు విపక్ష బీజేపీ కూడా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వీలయినన్ని ఎక్కువ సీట్లను గెలుచుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎవరికి తోచినట్టుగా వారు అన్న రీతిన అక్కడ జరుగుతున్న రాజకీయం... రాజకీయాల్లోకి అనివార్యంగా అడుగుపెట్టబోతున్న ప్రముఖ నటి - అలనాటి అందాల హీరోయిన్ సుమలతను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలుస్తోంది. సుమలత పాలిటిక్స్ కు కొత్తే అయినా... ఆమె భర్త, కన్నడ రెబల్ స్టార్ గా ఎదిగిన అంబరీష్ రాజకీయాలకు కొత్తేమీ కాదు కదా. అంబరీష్ మరణంతో సుమలత ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వక తప్పని పరిస్థితి.
భర్త ఆశయాలకు అనుగుణంగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పటికే సిద్ధమైపోయిన సుమలతకు కన్నడ మార్కు పాలిటిక్స్ ఏమాత్రం ఊపిరి ఆడనీయడం లేదు. అంబరీష్ రాష్ట్రంలోని మండ్య జిల్లాకు చెందిన వారు. జిల్లాలో ఆయన బంధు వర్గం - సామాజిక వర్గం మెండుగా ఉంది. ఈ క్రమంలో ఇదే జిల్లాలోనే పోటీ చేస్తూ వస్తున్న అంబరీష్ సినిమాల మాదిరే రాజకీయాల్లోనూ సక్సెస్ ఫుల్ నేతగా ఎదిగారు. ఆయన మరణం తర్వాత సాధారణంగా ఆయన స్థానాన్ని భర్తీ చేయనున్న సుమలత కూడా ఆయన ప్రాతినిధ్యం వహించిన స్థానం నుంచే బరిలోకి దిగడం సర్వసాధారణం. అయితే కన్నడ మార్కు పొత్తు రాజకీయాలు ఆమెను మండ్య జిల్లాలో పోటీకి అనుమతించేది లేదన్న రీతిలో సాగుతున్నాయి. మండ్య సీటుపై కన్నేసిన జేడీఎస్ నేత... సుమలతను వేరే నియోజకవర్గానికి మార్చేందుకు తనదైన మార్కు పాలిటిక్స్‌కు తెర తీశారు. కింగ్ మేకర్‌గా ఉంటానంటూ ప్రకటించిన జేడీఎస్... బీజేపీ ఆడిన గేమ్ కారణంగా ఏకంగా సింహాసనమే దక్కించుకుంది. ఈ క్రమంలో జేడీఎస్ చెప్పిన మాటకు కాంగ్రెస్ పార్టీ ఊకొట్టక తప్పడం లేదు.
ఈ క్రమంలోనే మండ్య సీటుపై కన్నేసిన జేడీఎస్ కీలక నేత, మండ్య సిట్టింగ్ ఎంపీ శివరామే గౌడ అక్కడి నుంచి మరోమారు పోటీకి సిద్ధపడ్డారు. శివారామే లేకుంటే... సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడను అక్కడి నుంచి బరిలోకి దింపాలని జేడీఎస్ అధినేత దేవేగౌడ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సీటును అంబరీష్ సతీమణి హోదాలో బరిలోకి దిగుతున్న సుమలతకు వదిలేది లేదని జేడీఎస్ నేతలు... కాంగ్రెస్ కు తేల్చి చెప్పినట్టుగా సమాచారం. బెంగళూరు సౌత్ నుంచి సుమలతను బరిలోకి దింపినా తాము సహకరిస్తామని కూడా జేడీఎస్ ఓ ఉచిత సలహా పడేసింది. బెంగళూరు సౌత్ కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్ సొంత నియోజకవర్గం. ఇటీవలే ఆయన మరణించడంతో ఆ స్థానం నుంచి ఆయన సతీమణిని బరిలోకి దింపేందుకు బీజేపీ దాదాపుగా నిర్ణయించింది. ఇదే స్థానం నుంచి సుమలతను దించాలని కాంగ్రెస్‌కు జేడీఎస్ సూచిస్తోంది.
అయితే మండ్య మినహా మిగిలిన ఏ స్థానం నుంచి కూడా పోటీ చేసేందుకు సుమలత సిద్ధంగా లేరని తెలుస్తోంది. తన భర్త ఆశయాల మేరకు రాజకీయాల్లోకి వస్తున్న తాను... తన భర్త ప్రాతినిధ్యం వహించిన మండ్య నుంచే బరిలోకి దిగుతానని, దీని ద్వారా తన భర్తను ఆదరించిన వారికి మరింత మేర సేవ చేసుకునే వెసులుబాటు ఉంటుందని కూడా సుమలత చెబుతున్నారు.అయితే ఆమె వాదనను కనీసం వినేందుకు కూడా సిద్ధంగా లేని జేడీఎస్ తనదైన పొత్తుల కత్తులను బయటకు తీస్తోంది. పలితంగా ఇప్పుడు ఇష్టం లేకపోయినా కూడా సుమలత మండ్య స్థానం నుంచి కాకుండా వేరే స్థానం నుంచే పోటీ చేసేందుకు సరేననక తప్పడం లేదట. జేడీఎస్ ఒంటెత్తు పోకడలను పంటి బిగువునే భరిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ... సుమలతను బుజ్జగించే పనిని ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌కు అప్పగించిందట. ఇప్పటికే శివకుమార్ రంగంలోకి దిగారని, సుమలత తన ఇష్టానికి వ్యతిరేకంగా ఇతర స్థానాల నుంచే పోటీ చేయక తప్పదన్న వాదన వినిపిస్తోంది.