ఆ నటుడ్ని ఎవ‌రు పిలిస్తే ఆ పార్టీకి వెళ‌తార‌ట‌

Update: 2017-09-24 05:05 GMT
ప్ర‌ముఖ న‌టుడు స‌మ‌న్ వ్యాఖ్య‌లు కాస్త ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. ఆయ‌న చెప్పే మాట‌లు పైకి చూస్తే బాగున్న‌ట్లే క‌నిపించినా.. లోతుల్లోకి వెళితే మాత్రం ఏమాత్రం అత‌క‌ని రీతిలో ఉండ‌టం క‌నిపిస్తుంది. ఇటీవ‌ల కాలంలో త‌మిళ‌నాడులో సినిమా న‌టులు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు రాజకీయాల్లోకి వ‌చ్చేస్తామంటూ చెప్ప‌టం క‌నిపిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో ఈ జోరు క‌నిపిస్తుందన్న‌ట్లుగా ఉంది. మ‌రో ఏడాదిన్న‌ర వ్య‌వ‌ధిలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు తెర లేవ‌నున్న నేప‌థ్యంలో రాజ‌కీయాల మీద సినీ ప్ర‌ముఖుల ఆస‌క్తి అంత‌కంత‌కూ పెర‌గ‌టం ఖాయం.
తాజాగా తాను రాజకీయాల్లోకి రావాల‌ని డిసైడ్ అయిన‌ట్లుగా వెల్ల‌డించారుసినీ న‌టులు సుమ‌న్‌. ఇప్ప‌టివ‌ర‌కూ తాను ఏ పార్టీని సంప్ర‌దించ‌లేద‌ని.. ఏ పార్టీ ఆహ్వానిస్తేఆ పార్టీలోకి వెళ‌తాన‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సుమ‌న్‌.. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌టం విశేషం.

ఎవ‌రైనా స‌రే.. రాజ‌కీయాల్లోకి రావాల‌ని డిసైడ్ అయిన త‌ర్వాత తన మ‌న‌స్తత్వానికి ఏ పార్టీ బాగా సూట్ అవుతుందోన‌న్న విష‌యం మీద ఒక అభిప్రాయం ఉంటుంది. అందుకు భిన్నంగా రాజ‌కీయాల్లోకి రావాల‌ని అనుకుంటున్నా.. ఏ పార్టీలో చేరాల‌న్న విష‌యం మీద క్లారిటీ లేని సుమ‌న్ లాంటి వాళ్లు రాజ‌కీయాల్లోకి రావ‌టం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏమైనా ఉంటుందా? అన్న‌ది ప్ర‌శ్నే.
Tags:    

Similar News