అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ -1 బితో సహా విదేశీ వర్క్ వీసాలను ఈ ఏడాది చివరి వరకు నిలిపివేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయం అమెరికా కార్పొరేట్ రంగాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రపంచంలోనే నంబర్ 1 టెక్నాలజీ దిగ్గజమైన గూగుల్ సంస్థ సిఇఓ సుందర్ పిచాయ్ తాజాగా ట్రంప్ నిర్ణయంపై నిరాశ వ్యక్తం చేశారు.
విదేశీ పనిమంతులను దేశంలోకి రాకుండా ట్రంప్ నిషేధించడంపై తన అసంతృప్తిని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్విట్టర్‌లో వెళ్లగక్కారు.
'' అమెరికా ఆర్థిక విజయానికి విదేశీ నిపుణులు ఇమ్మిగ్రేషన్ ఎంతో దోహదపడింది, ఇది టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా అమెరికాను నిలిపేలా చేసింది. గూగుల్ కూడా ఈస్థాయి చేరడానికి అదే కారణం.. '' అని సుందర్ పిచాయ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ట్రంప్ ప్రకటనతో పూర్తిగా నిరాశ చెందానని సుందర్ పిచాయ్ తెలిపారు. గూగుల్ అందరికీ అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో ఉందని.. వలసదారులతో కలిసి ఉంటామని తెలిపారు. ట్రంప్ నిర్ణయం తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని.. తాము మాత్రం ఇమ్మిగ్రాంట్స్ కు మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తూనే ఉంటామని పిచాయ్ కుండబద్దలు కొట్టారు.
ట్రంప్ విధించిన వర్క్ వీసా సస్పెన్షన్ కు వ్యతిరేకంగా స్పందించిన వ్యక్తి సుందర్ పిచాయ్ మాత్రమే కాదు. పౌర -మానవ హక్కులపై నాయకత్వ సదస్సు అధ్యక్షుడు సీఈవో అయిన వనితా గుప్తా కూడా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారే వలసల నిషేధాన్ని విధిస్తూ దారుణమైన పిలుపునిచ్చినందుకు అమెరికా అధ్యక్షుడిని నిందించారు.