నిబంధనలు కఠినంగా అమలు చేస్తారని చెప్పే సింగపూర్ దేశం.. బ్లాక్ మనీ దాచుకోవటానికి కేరాఫ్ అడ్రస్ గా మారిందా? అంటే అవునని చెబుతోంది సండే గార్డియన్ లో వచ్చిన తాజా కథనం. ఒకవైపు ఏపీ సర్కారు సింగపూర్ తో ఏపీ రాజధాని నిర్మాణం కోసం భారీగా ఆధారపడుతున్న వేళ..సింగపూర్ ఇమేజ్ మీద మరకేసేలా తాజా కథనం ఉందని చెబుతున్నారు.
గతంలో స్విస్ బ్యాంకుల్లో బ్లాక్ మనీ దాచుకోవటానికి ఎక్కువ ఆసక్తి ప్రదర్శించిన వారంతా ఇప్పుడు.. సింగపూర్ లో అలాంటి నగదును దాచుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తేల్చారు. ఇందుకోసం భారత్ నుంచి భారీగా నల్లధనం తరలిపోతుందని సదరు కథనం చెబుతోంది. పశ్చిమ బెంగాల్ లో సంచలనం సృష్టించిన శారదా చిట్ సంస్థ కుంభకోణంలోని మొత్తం కూడా సింగపూర్ కు తరలి వెళ్లిందంటూ పేర్కొనటం గమనార్హం.
సింగపూర్ లో భారతీయులు తమ ధనాన్ని భారీగా దాచుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మరి.. ఏపీ అధికారపక్షం మీద కూడా ఇలాంటి ముద్ర పడే అవకాశం ఎక్కువే. గార్డియన్ పత్రికలో వచ్చిన కథనంతో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కోలకు చెందిన బ్లాక్ మనీ సింగపూర్ కు తరలి వెళుతుందని ఏపీ విపక్షం ఆరోపించినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. బ్లాక్ మనీ దాచుకోవటానికి సింగపూర్ కు మించిన సురక్షితమైన దేశం లేదన్న టాక్ నేపథ్యంలో.. ఏపీ సర్కారుపై మరిన్ని విమర్శల మరకలు పడటం ఖాయం. మరి.. ఇలాంటి వాటిని బాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.