మహాబలిపురం కొత్త చరిత్ర చెప్పనుందా?

Update: 2016-03-19 09:49 GMT
ఇప్పటికే అందుబాటులో ఉన్న చరిత్రకు సరికొత్త సమాచారం జత కానుందా? అంటే అవుననే చెప్పాలి. తమిళనాడులోని మహాబలిపురంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. సరికొత్త చరిత్ర బయటకు రానుంది. మహాబలిపురంలోని సముద్ర గర్భంలో 12 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జరిపిన అత్యాధునిక పరిశోధనలు సరికొత్త విషయాల్ని బయటకు తీసుకొచ్చాయి.

సముద్రగర్భంలో శిల్పకళా సంపదతో పాటు.. భారీ కుడ్యాలు.. నున్నపు రాళ్లను సముద్ర గర్భంలో గుర్తించారు. అంతేకాదు.. పలు ప్రాచీన శిథిలాలు బయట పడ్డాయి. తాజా పరిశోధనల కారణంగా.. కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజా పరిశోధనల అనంతరం బయటపడిన శిల్ప సంపదను పరిశీలిస్తున్న నిపుణులు చెబుతున్నదేమంటే.. పలు శతాబ్ధాల ముందు భూమిగా ఉన్న ప్రాంతం మొత్తం సముద్రతీరంగా మారిందని.. గతంలో భూమిగా ఉన్న సమయంలో ఉన్న ఇళ్లు.. ఆలయాలు అన్నీ మునిగిపోయాయని.. అలాంటి వాటిల్లో తాజా ఉదంతం ఒకటని చెబుతున్నారు.

తాజాగా బయటపడిన ప్రాచీన నగరానికి చెందిన కుడ్యాల శిధిలాలపై మరిన్ని పరిశోధనలు జరపటం ద్వారా.. ఇవన్నీ ఏ కాలం నాటివన్న విషయాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ శిధిలాల మీద 15 సెంటీమీటర్లకు పైగా పేరుకుపోయిన నాచును తొలిగించటం ద్వారా సరికొత్త సమచారం బయటకు రానుందని చెబుతున్నారు. సరికొత్త చరిత్ర మరికొద్ది రోజుల్లో బయటకు రానుందన్న మాట.
Tags:    

Similar News