అత్యవసర పరిస్థితులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఔషధాలను తరలించేందుకు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-రిషికేశ్ తాజాగా ట్రయల్ నిర్వహించింది. ఉత్తరాఖండ్ లోని టెహ్రీ గర్వాల్ లోని జిల్లా ఆస్పత్రి నుంచి రెండు కిలోల బరువున్న టీబీ మందుల ప్యాకేజీని వెర్టి ప్లేన్ ఎక్స్-3 డ్రోన్ ద్వారా తరలించారు.
రిషికేశ్ ఎయిమ్స్ హెలిప్యాడ్ నుంచి ఆసుపత్రికి మధ్య దూరం 40 కిలో మీటర్లు ఉండగా డ్రోన్ కేవలం అరగంటలోనే అక్కడికి చేరుకొని మందులను డెలివరీ చేసింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ హర్షం వ్యక్తం చేశారు. పర్వత ప్రాంతాల్లోని ఆస్ప్రతులకు ఔషధాలను సరఫరా చేసేందుకు ఈ ప్రయోగం ఎంతగానో దోహద పడుతుందని తెలిపారు.
సరైన రవాణా సదుపాయాలు లేని ప్రాంతాలు.. కొండ ప్రాంతాల్లోని ఆస్పత్రులు.. రోగులకు మందులు సరఫరా చేయడానికి అద్భుతమైన మార్గం డ్రోన్స్ ద్వారా లభించినట్లయిందన్నారు. పర్వత ప్రాంతాల్లో 40 కిలోల మీటర్ల దూరం ప్రయాణించాలంటే సుమారు రెండు గంటలు పడుతుందని తెలిపారు. కానీ ఎక్స్ 3 డ్రోన్ కేవలం 30 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకుందని సంతోషం వ్యక్తం చేశారు.
త్వరలోనే ఢిల్లీ ఎయిమ్స్ పరిధిలోని ఝ్జజ్జర్ లో సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేషనల్ క్యాన్సర్ సెంటర్ కు డ్రోన్స్ ద్వారా మందులు పంపిణీ చేయడానికి ట్రయల్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. బలహీనమైన రవాణా నెట్ వర్క్.. ప్రకృతి విపత్తులు.. కఠినమైన పరిస్థితులు తలెత్తినపుడు డ్రోన్స్ ద్వారా ఔషధాలు పంపిణీ చేయచ్చని వివరించారు.
కాగా రిషికేశ్ ఎయిమ్స్ 2025 నాటికి టీబీని నిర్మూలించే దేశవ్యాప్త కార్యక్రమానికి మద్దతుగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఎక్స్ 3 డ్రోన్ ద్వారా మందులను సరఫరా చేయడంతోపాటు రోగుల నుంచి కఫం నమూనాలను ప్రయోగశాలలకు తరలించడానికి ఉపయోగించనున్నారు. ఇక ఎక్స్ 3 డ్రోన్ ను టెక్ ఈగల్ ఇన్నోవేషన్స్ తయారు చేసింది.
ఇదిలా ఉంటే భారత్ లో డ్రోన్ల ద్వారా ఔషధాలను సరఫరా చేయడం అనేది ఇదే మొదటిది కాదు. గతంలోనూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలోని ఒక ప్రాజెక్టులో మరియు మణిపూర్లో డ్రోన్స్ ఉపయోగించి కోవిడ్ టీకాలను సరఫరా చేశారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్ లోని బెంగుళూరుకు చెందిన స్టార్టప్ మందులను డెలివరీ చేయడానికి ఒక పైలట్ ప్రాజెక్టు నిర్వహించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.