‘కిరణ్’ విభజన పిటీషన్ విచారణకు సుప్రీం ఓకే

Update: 2017-01-16 15:39 GMT
ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ విభజన నేపథ్యంలో రూపొందించిన ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంపై పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏపీ విభజనను ఆక్షేపిస్తూ.. ఈ సందర్భంగా తయారు చేసిన విభజన చట్టంలో లోపాల్ని ఎత్తి చూపుతూ..ఈ చట్టంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలంటూ ఉమ్మడి రాష్ట్ర ఆఖరి ముఖ్యమంత్రిగా వ్యవహరించొన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మరో 24 మంది పిటీషన్లు జారీ చేశారు.

ఈ రోజు ఈ పిటీషన్లు అన్నింటిని కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. మొత్తం అన్ని పిటీషన్లను వేర్వేరుగా కాకుండా ఒకేసారి విచారణ జరిపేందుకు సుప్రీం నిర్ణయించింది. మాజీముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. రఘురామ రాజుతో సహా 24 మంది విభజనచట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీం.. అన్ని పిటీషన్లను కలిపి ఒకే వేదిక మీద విచారణ జరుపుతామని వెల్లడించింది.

అదే సమయంలో ఈ పిటీషన్లపై కేంద్రం తన అఫిడవిట్లను దాఖలు చేయాలని సుప్రీం కోరింది. ఇందుకోసం రెండు వారాల సమయం ఇచ్చింది. రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగేదని.. విభజన చట్టంలో పలు సమస్యలు .. లోపాలు ఉన్నట్లుగావారు సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. విభజన చట్టం ఆమోదంపొందిన తర్వాత కూడా తెలంగాణ నుంచి కేంద్రం కొన్ని మండలాల్ని ఏపీకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్రాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుకుంటూ.. కేసు విచారణను వాయిదా వేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News