మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఈనెల 21న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పార్టీలన్నీ సిద్ధమవుతున్న వేళ మహారాష్ట్ర సీఎం, బీజేపీ రాష్ట్ర సారథి అయిన దేవేంద్ర ఫడ్నవీస్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు అఫిడవిట్ కేసులో ఆయనను విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది..
మహారాష్ట్రకే చెందిన సతీష్ యుకీ అనే వ్యక్తి ఫడ్నవీస్ 2014 ఎన్నికల అఫిడవిట్ లో క్రిమినల్ కేసులను చేర్చలేదంటూ ముంబైలోని కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అక్కడ సీఎం ఫడ్నవీస్ కు క్లీన్ చిట్ వచ్చింది. ఇక ముంబై హైకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా క్లీన్ చిట్ లభించింది. దీంతో పిటీషనర్ సతీష్ యుకీ సుప్రీం కోర్టు తలుపుతట్టాడు.
ఈ పిటీషన్ ను విచారించిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, దీపక్ గుప్తా, అనురుద్ధ బోస్ లతో కూడిన ధర్మాసనం అనుమతిచ్చింది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు షాకిచ్చింది. ఫడ్నవీస్ ను ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 కింద ప్రాసిక్యూట్ చేసేందుకు సుప్రీం కోర్టు మంగళవారం అనుమతించింది. విచారణ కోర్టు, ముంబై హైకోర్టు ఫడ్నవీస్ కు క్లీన్ చిట్ ఇవ్వడం సరికాదని స్పష్టం చేసింది. చట్టప్రకారం తప్పుడు అఫిడవిట్ అంగీకారయోగ్యం కాదని.. ఆ ప్రకారం దిగువ కోర్టులు తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది.
దీంతో మహారాష్ట్ర ఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫడ్నవీస్ ఈ తప్పుడు అఫిడవిట్ కేసులో విచారణను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈనెల 21న ఎన్నికలు జరుగనుండడంతో బీజేపీకి, ఫడ్నవీస్ కు ఈ కేసు గుదిబండగా మారింది..