తెలంగాణ ఫామ్‌హౌజ్ ఇష్యూపై `కళ్లుమూసుకున్నామని` సుప్రీం కోర్టు కామెంట్లు
అవినీతిపరులే దేశాన్ని నాశనం చేస్తున్నారని.. సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బుతోనే ఆ కేసుల నుంచి బయటపడుతున్నారని వ్యాఖ్యానించింది. సామాజిక కార్యకర్త గౌతమ్ నావలఖ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఇటీవల తెలంగాణలో వెలుగు చూసిన ఫామ్‌హౌజ్ ఇష్యూపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
``ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు పెట్టి కొంటున్నారు. ఇవన్నీ మేం చూశాం. అయినా.. కళ్లు మూసుకున్నాం. ఇదేం ప్రజాస్వామ్యం.. ఇవేం అవినీతి పనులు. ఇంతకన్నా ఘోరం ఉంటుందా?`` అని పరోక్షంగా తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశాన్ని సుప్రీం కోర్టు ప్రస్తావించింది.
భీమాకోరెగాం కేసులో అరెస్టయిన తనను జుడీషియల్ కస్టడీలో కాకుండా ఆరోగ్య సమస్యల దృష్ట్యా గృహనిర్బంధం చేయాలంటూ సామాజిక కార్యకర్త గౌతమ్ నావలఖ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ రాజు.. గౌతమ్ అభ్యర్థనను వ్యతిరేకించారు. నావలఖ వంటివారు దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని, వారి పనే అది అని తెలిపారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేష్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం వాస్తవంగా దేశాన్ని ఎవరు నాశనం చేస్తున్నారో మీకు తెలుసా అని ఏఎస్జీని ప్రశ్నించింది.
అవినీతిపరుల వల్లే దేశం నాశనం అవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి చూస్తే అక్కడ జరుగుతున్న విషయాలు తెలుస్తాయని తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నా అవినీతిపరులపై ఎలాంటి చర్యలు కనిపించడం లేదని మండిపడింది. ``ఇటీవల.. ఎన్నికైన ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయల్లో బేరాలు ఆడుతున్న వ్యక్తులకు సంబంధించిన వీడియోలను చూశామ``ని గుర్తుచేసింది. అయినప్పటికీ కళ్లు మూసుకొని ఉన్నామని వ్యాఖ్యానించింది. వారు దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి పనులూ చేయడం లేదని మీరు చెబుతున్నారా? అని అదనపు సొలిసిటర్ జనరల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది.
మీరు వారిని సమర్థించకపోయినప్పటికీ వారు ఉత్సాహంగా ముందుకెళుతూనే ఉన్నారని పేర్కొంది. వారిని బయటకు తీసుకొచ్చేందుకు డబ్బు సంచులు సాయపడుతున్నాయని వ్యాఖ్యానించింది. అయితే అవినీతిపరులను తాము సమర్థించడం లేదని., వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని అదనపు సొలిసిటర్ జనరల్ అన్నారు.
గౌతమ్ నావలఖను గృహనిర్భందంలో ఉంచుతామన్న కోర్టు అందుకు ఎలాంటి నిబంధనలు పెడతారో చెప్పాలని జాతీయ దర్యాప్తు సంస్థను ఆదేశించింది. మొత్తానికి తెలంగాణ ఇష్యూపై సుప్రీంకోర్టు సీరియస్‌గానే ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.