ఏపీ ఎన్నికల ప్రధాన కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వివాదంలో ఏపీ ప్రభుత్వానికి నిరాశ ఎదురైంది. నిమ్మగడ్డ పునర్ నియామకాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. మూడు వారాల్లో కేసు తుది వాదనలు వింటామని కేసును సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ వేసింది. ఈ పీటీషన్ పై స్పందించిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. తర్వాతే తుది వాదనలు వింటామని వాయిదా వేసింది.
ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. చంద్రబాబు ప్రభుత్వంలో నియామకమైన ఈయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆయనను తొలగించారు. ఆర్డినెస్స్ తీసుకొచ్చి మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను నియమించారు. అయితే హైకోర్టు దాన్ని కొట్టివేసి నిమ్మగడ్డనే ఏపీ ఎన్నికల కమిషనర్ అని ప్రకటించింది. దీంతో జగన్ దీనిపై సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. సుప్రీం కోర్టు కూడా నిమ్మగడ్డకే అనుకూలంగా స్టే ఇవ్వడానికి నిరాకరించింది. తదుపరి తుది వాదనలు వినేందుకు వాయిదా వేసింది.