ఇండియాలో కరోనా మహమ్మారి తో చనిపోయినవారి కుటుంబాలకు ఆర్ధిక సాయం మంజూరు చేసేలా మార్గదర్శకాలను జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు సోమవారం తిరస్కరించింది. పిటిషన్ ను తోసిపుచ్చిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం.. కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి తమ ఆర్ధిక పరిస్థితి ఆధారాంగా రాష్ట్రాలు వేర్వేరు విధానాలు అవలంభిస్తున్నాయని , ఈ సమయంలో సుప్రీంకోర్టు ఎటువంటి సూచనలు చేయబోదని వెల్లడించింది.
కరోనా తో మృతిచెందిన కుటుంబాలకు ఆర్ధిక సాయం విషయంలో దేశమంతటా ఒకే విధానం, మార్గదర్శకాలు అమలుచేసే ఆదేశాలు జారీచేయాలని సుప్రీంకోర్టును పిటిషనర్ కోరాడు. ఒకే విధమైన జాతీయ విధానాన్ని రూపొందించాలని మాత్రమే మేము అడుగుతున్నాం అని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే, ఈ పిటిషన్ ను దేశ అత్యున్నత ధర్మాసనం తోసిపుచ్చింది.
ఇకపోతే , కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌తో 57,542 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల సంఖ్య 31 లక్షలు దాటగా.. వీరిలో 23 లక్షల మందికిపైగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7.10 లక్షల యాక్టివ్ కేసులు దేశంలో ఉన్నాయి. కాగా , గత గత 24 గంటల్లో 61,408 మందికి కరోనా సోకింది. అదే సమయంలో 836 మంది మృతి చెందారు.